మా వాళ్లు టవల్‌ ఆరేయకపోతే ఇలా చేస్తాం..!

‘స్నానం చేశాక తడి తువాలుని బెడ్‌ మీద వేయొద్దు’ అని ఎంత చెప్పినా కొన్ని ఇళ్లల్లో అలవాటు మానరు. దీన్ని మాన్పించిన వారిలో కొందరి అనుసరణీయ చిట్కాలివీ...

Updated : 29 Jun 2024 16:07 IST

‘స్నానం చేశాక తడి తువాలుని బెడ్‌ మీద వేయొద్దు’ అని ఎంత చెప్పినా కొన్ని ఇళ్లల్లో అలవాటు మానరు. దీన్ని మాన్పించిన వారిలో కొందరి అనుసరణీయ చిట్కాలివీ...

బహుమతి ఇస్తానని...

తుడుచుకున్నాక తువాలు ఆరేయమని మనం చెప్పడం, పిల్లలు మర్చిపోవడం చాలా ఇళ్లల్లో కనిపించేదే! మాన్పించడానికి నా చిట్కా ఇది. రోజూ చెప్పడం కాదు... ఈసారి వారం లేదా నెలరోజుల తేదీతో ఒక పేపర్‌ సిద్ధం చేయండి. ఆరోజు తువాలు ఆరేయగానే దానిలో సంతకం చేయాలన్నమాట. దాన్ని కాస్త అందంగా ఉండేలా చూసుకోండి. ఇంకా వారికి కనిపించే చోట పెడితే సరిపోతుంది. ఓ వారం, పదిరోజులు తప్పకుండా చేసేలా దగ్గరుండి ప్రోత్సహించండి. తు.చ. తప్పకుండా కొనసాగిస్తే బహుమతి ఇస్తానని ప్రకటించండి. అప్పుడు ఇక మర్చిపొమ్మన్నా మర్చిపోరు. మనం చెప్పకుండానే కొనసాగిస్తారు.

గౌతమి గొల్లపూడి


అదే ఇవ్వండి!

వాళ్లు అలా తడి తువాలు మంచం మీద పడేయగానే ఏం చేస్తాం. కోపగించుకున్నా చివరికి తీసి మనమే ఆరేస్తాం. ఇలాగైతే వాళ్లకెలా తెలుస్తుంది. ఈసారి దాన్ని అలాగే ఉండచుట్టి పక్కన పెట్టండి. మరుసటి రోజు ‘టవల్‌’ అని అడగగానే దాన్నే తెచ్చి ఇవ్వండి. తడికి ముక్కవాసన వస్తుంది కదా! అదేంటి అనడిగితే ‘నువ్వే కదా ఆరేయలేదు. మర్చిపోతే ఇలా వాసన వచ్చే దాంతోనే తుడుచుకోవాలి’ అని చెప్పండి. ఇక, మర్చిపోకుండా ఆరేస్తారు. మృదువుగా చెబుతూ కఠినంగా గుర్తు చేయడమే మేలు.

కోరెపు జ్యోత్స్న


Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్