అమ్మ మీద అరిచేస్తున్నా!

నాకు పదహారేళ్లు. ఎందుకో తెలియదు... ఊరికే అలసిపోతున్నా. విసుగూ వస్తోంది. చిన్నచిన్న వాటికీ చిరాకు, కోపం తన్నుకొస్తున్నాయి. ఏదైనా చెబితే అమ్మ మీదా అరిచేస్తున్నా. దాంతో తను బాధపడుతోంది. విషయం తెలిశాక ‘అప్పుడే పెద్దదానివి అయిపోయా అనుకుంటున్నావా’ అని నాన్న కోప్పడుతున్నారు. కానీ నేనేం కావాలని చేయట్లేదు.

Published : 28 Jun 2024 13:20 IST

నాకు పదహారేళ్లు. ఎందుకో తెలియదు... ఊరికే అలసిపోతున్నా. విసుగూ వస్తోంది. చిన్నచిన్న వాటికీ చిరాకు, కోపం తన్నుకొస్తున్నాయి. ఏదైనా చెబితే అమ్మ మీదా అరిచేస్తున్నా. దాంతో తను బాధపడుతోంది. విషయం తెలిశాక ‘అప్పుడే పెద్దదానివి అయిపోయా అనుకుంటున్నావా’ అని నాన్న కోప్పడుతున్నారు. కానీ నేనేం కావాలని చేయట్లేదు. అర్థం చేసుకోరే? 

ఓ సోదరి

నువ్వే కాదు... నీ వయసులో చాలామంది ఎదుర్కొనే పరిస్థితే ఇది. యుక్తవయసులోకి అడుగుపెట్టాక శారీరకంగా, మానసికంగా చాలా మార్పులు వస్తాయి. శరీరంలో జరిగే భౌతిక రసాయనాల చర్యల మీద మనకు నియంత్రణ ఉండదు. ఇవేమో కొన్నిసార్లు శారీరక ఇబ్బందులే కాదు మానసికంగా అలసటనీ, విసుగునీ తెప్పిస్తాయి. ఆ కోపాన్ని బయటివాళ్లపై చూపించలేం కదా! అందుకే దగ్గరివాళ్లపై ప్రదర్శిస్తుంటాం. వీటికి ఎక్కువ బలయ్యేది తల్లే. నెలసరి, అది వచ్చే ముందు, వచ్చాక ఇలాంటివన్నీ సహజం. నీరసంతో చదువు మీదా ఏకాగ్రత చూపించలేరు. చిన్న విషయాలూ అసహనానికి గురిచేస్తాయి. తట్టుకోలేక ప్రదర్శిస్తే ఇలా నెగెటివ్‌ ప్రభావం పడుతుంది. అసలే ఎదిగే పిల్లలు ఇలా ఉండాలి, ఫలానా రీతిలో మాట్లాడాలి, ఇలా ప్రవర్తించాలి, దుస్తులు వేసుకోవాలి అన్న అభిప్రాయాలుంటాయి. అవి నీ అభిరుచులకు భిన్నంగా ఉన్నప్పుడూ అసహనం తలెత్తుతుంది. ఇక పోలికలూ మొదలైతే స్వీయ సందేహాలూ మొదలవుతాయి. ఇవన్నీ నీపై ప్రభావం చూపిస్తుండొచ్చు. ఇక తరవాత ఏం చదవాలి? ఏ కెరియర్‌ తీసుకోవాలన్న ఒత్తిడీ సరేసరి. ఇవన్నీ అందరూ దాటొచ్చేవే అయినా చెప్పందే ఎవరూ అర్థం చేసుకోలేరు. కాబట్టి ముందు ఏ అంశాలు నీలో అసహనం, కోపానికి కారణమవుతున్నాయో గమనించుకో. తరవాత వాటి గురించి పెద్దవాళ్లతో చర్చించు. నిన్ను అర్థం చేసుకునే వాళ్లలో ముందుండేది అమ్మానాన్నలే. కాబట్టి, తప్పక అర్థం చేసుకోవడమే కాదు, పరిష్కారాన్నీ చూపగలుగుతారు. అందుకే, నీలో నువ్వు బాధపడక వాళ్లతో మాట్లాడే ప్రయత్నం చెయ్యి. అప్పుడు నీకూ ఏ గిల్టీనెస్‌ ఉండదు. 

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్