అన్నయ్యే అంతా రాయించేసుకున్నాడు!

ఊళ్లో తాతయ్య పేరున ఉన్న పొలాన్ని అమ్మి, ఆ మొత్తానికి నాన్న కొన్ని డబ్బులు చేర్చి హైదరాబాద్‌లో 250 గజాల స్థలం కొన్నారు. అందులో అన్నయ్యకు 200 గజాలు, మిగిలిన 50 నాకు ఇస్తామన్నారు. కానీ, ఆ ఒప్పందానికి భిన్నంగా అమ్మ పేరున ఉన్న ఆ స్థలాన్ని తనే రాయించుకున్నాడు.

Published : 25 Jun 2024 12:29 IST

ఊళ్లో తాతయ్య పేరున ఉన్న పొలాన్ని అమ్మి, ఆ మొత్తానికి నాన్న కొన్ని డబ్బులు చేర్చి హైదరాబాద్‌లో 250 గజాల స్థలం కొన్నారు. అందులో అన్నయ్యకు 200 గజాలు, మిగిలిన 50 నాకు ఇస్తామన్నారు. కానీ, ఆ ఒప్పందానికి భిన్నంగా అమ్మ పేరున ఉన్న ఆ స్థలాన్ని తనే రాయించుకున్నాడు. అందులో నాకు ఎటువంటి హక్కూ ఉండదా?

ఓ సోదరి

తాతయ్య ఆస్తి అమ్మి.. మీ నాన్న స్థలం కొన్నట్లు ఆధారం ఏమైనా ఉందా? అసలు మీకు స్థలం రాసిస్తామని ఎవరు చెప్పారు? అందుకు సాక్ష్యంగా ఏమైనా కాగితం రాసుకున్నారా? అసలు స్థలం మీ అమ్మ పేరు మీదకు ఎప్పుడు బదిలీ అయ్యింది. మీ నాన్న కొనేటప్పుడే ఆవిడ పేరున కొన్నారా లేక ఆయన చనిపోయాక ఆమెకు దక్కిందా? వంటి వివరాలు తెలియాల్సి ఉంది. తల్లిదండ్రులు చనిపోతే.. ఆ ఆస్తి (పిత్రార్జితం)పిల్లలందరికీ సమానంగా దక్కుతుంది. ఒకవేళ వారు జీవించి ఉంటే... తమ పిత్రార్జితపు ఆస్తిని అమ్మడం, గిఫ్ట్‌డీడ్‌లు ఇవ్వడం, వీలునామా రాయడం వంటివి చేసే హక్కు లేదు. ఎందుకంటే అందులో మనవలకు కూడా వాటాలుంటాయి. ఇక, మీ విషయానికి వస్తే అన్నకు 200గజాలు, మీకు తక్కువ వాటాగా 50 గజాలు ఇవ్వాలన్న నియమం లేదు. ఆస్తి ఏదైనా ఆడ, మగ ఇద్దరికీ సమానంగా చెందుతుంది. అలాకాకుండా మీ తండ్రి ఆయన భార్య పేరునే ఆస్తి కొంటే... అది ఆవిడ స్వార్జితం అవుతుంది. దాన్ని ఆమె తనకు నచ్చినట్లుగా ఎవరికైనా ఇవ్వొచ్చు. అలాకాకపోతే మాత్రం మీరు మీ వాటా కోసం పార్టిషన్‌ దావా వేయొచ్చు. అయితే అది మీ తాతగారి ఆస్తిని అమ్మి కొన్నదని కోర్టులో నిరూపిస్తే చాలు. మీ దావా గెలవగలరు. ముందు ఓ మంచి లాయర్‌ని సంప్రదించండి మీ సమస్య పరిష్కారమవుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్