ముప్పై ఏళ్లయినా... వదలట్లేదు!

మాది ధనిక కుటుంబం. చిన్నప్పుడు నాతో చదువుకునే అబ్బాయి ప్రేమ పేరుతో వెంటపడేవాడు. నేను అంతగా పట్టించుకోలేదు. సరిగ్గా 30ఏళ్ల తర్వాత కాకతాళీయంగా కలిశాం. ఆ తర్వాత ఓ చిన్న అవసరానికి నేనే అతనికి ఫోన్‌ చేశా.

Published : 24 Jun 2024 12:43 IST

మాది ధనిక కుటుంబం. చిన్నప్పుడు నాతో చదువుకునే అబ్బాయి ప్రేమ పేరుతో వెంటపడేవాడు. నేను అంతగా పట్టించుకోలేదు. సరిగ్గా 30ఏళ్ల తర్వాత కాకతాళీయంగా కలిశాం. ఆ తర్వాత ఓ చిన్న అవసరానికి నేనే అతనికి ఫోన్‌ చేశా. ఆ పనిచేసి పెట్టాడు. అయితే, అదే అదనుగా తీసుకుని పదేపదే ఆకతాయితనంతో మెసేజ్‌లు పెడుతున్నాడు. పైగా నీపట్ల ఏమైనా అసభ్యంగా, అగౌరవంగా ప్రవర్తించానా అంటున్నాడు. భరించలేక తన నంబర్‌ బ్లాక్‌లో పెడితే... వేరే నంబర్ల నుంచి పంపుతున్నాడు. చాలా ఇబ్బందిగా ఉంది. ఇద్దరం మంచి హోదాలో, సమాజంలో పరపతితో ఉన్నాం. ఇద్దరికీ పెళ్లీడు పిల్లలున్నారు. నేను ఏం చేయాలి?

ఓ సోదరి

యుక్తవయసులో ఉండే ఆకర్షణల కారణంగా కొందరు అబ్బాయిలు ఇలా అమ్మాయిల వెంటపడడం లాంటివి చేస్తుంటారు. మీ విషయంలో అది ముప్పై ఏళ్ల కిందటి విషయం. మీకు ఇప్పుడు పెళ్లై, పిల్లలున్నారు. ఆయనకూ పెళ్లీడు బిడ్డలున్నారంటున్నారు. మీరు స్నేహపూర్వకంగా సాయం అడగడం, అది అతను చేయడం, దానికి మీరు కృతజ్ఞతగా ఉండడం వంటివన్నీ మీవైపు నుంచి మర్యాదపూర్వకంగానే జరిగిపోయాయి. ఆయన మాత్రం మెసేజ్‌లు పంపడం, మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం వంటివి చూస్తుంటే అతని వ్యక్తిత్వం పరిపక్వత చెందలేదు అనిపిస్తోంది. కొంతమంది మగవాళ్లు వాళ్ల ఆకతాయితనాన్ని పెద్దయినా పోగొట్టుకోలేరు. మీరు అతన్ని బ్లాక్‌ చేసినా కూడా మళ్లీ అలానే ప్రవర్తిస్తున్నాడంటే అతని ఉద్దేశం బాగాలేదు. మర్యాద పూర్వకంగానూ లేదు. కాబట్టి మీరు ఇబ్బంది పడేకంటే ఈ విషయం మీ భర్తకు తెలియజేయండి. మీ ఇద్దరి మధ్యా మనస్పర్థలు రావొద్దంటే మీరు ఉన్నది ఉన్నట్టు తనకు చెప్పడం మంచిది. అవసరమైతే మీ ఇద్దరూ అతన్ని వ్యక్తిగతంగా కలిసి, మీ రెండు కుటుంబాల ఆర్థిక, సామాజిక స్థితులు గుర్తుచేస్తూ మర్యాదను ఎలా కాపాడుకోవాలన్నదీ తెలియజేయండి. అప్పటికీ మార్పు రాకపోతే మీ భర్త సహకారంతో పోలీసులకు ఫిర్యాదు ఇవ్వొచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్