మొక్కలకూ సాయమిద్దాం ..!

తోట, బాల్కనీలో మొక్కలు ఆరోగ్యంగా పెరగడానికి ఎరువులెలా వేస్తామో, అవి సవ్యంగా ఎదిగేలా చేయడానికి సాయాన్నీ ఇవ్వాలి. ఇందుకోసం మార్కెట్‌లో పలురకాల ‘గార్డెన్‌ స్టేక్స్‌’ లభ్యమవుతున్నాయి.

Published : 24 Jun 2024 01:47 IST

స్వీట్‌ హోమ్‌

తోట, బాల్కనీలో మొక్కలు ఆరోగ్యంగా పెరగడానికి ఎరువులెలా వేస్తామో, అవి సవ్యంగా ఎదిగేలా చేయడానికి సాయాన్నీ ఇవ్వాలి. ఇందుకోసం మార్కెట్‌లో పలురకాల ‘గార్డెన్‌ స్టేక్స్‌’ లభ్యమవుతున్నాయి.

రింగ్‌ ఏర్పాటుతో... ఇనుము లేదా ప్లాస్టిక్‌తో తయారయ్యే ఈ స్టేక్స్‌ పొడవుగా ఉండి చివరలో రింగ్‌ ఉంటుంది. అవుట్‌డోర్‌ క్రోటన్స్, లిల్లీజాతి మొక్కలు, ఇండోర్‌ స్నేక్‌ ప్లాంట్‌ వంటివి నిటారుగా పెరగడానికి ఇవి సాయపడతాయి. మొక్క చివర్లో పూసే పూల కంకులు, చిగుర్లను స్టేక్‌కు చివర ఉన్న రింగ్‌లో సర్దితే పక్కకు వాలవు. అవసరమైనప్పుడు దీని పొడవును పెంచుకోవచ్చు కూడా. అలా మొక్క ఎదిగేకొద్దీ ఇది సాయపడుతుంది. అలాగే తీగజాతి పూలమొక్కలు తొట్టె నుంచి ఒకే ఎత్తులో పెరిగేలా చేయడానికి కంచెలా ఉండే స్టాండులు మార్కెట్‌లో లభ్యమవుతున్నాయి. దీంతో పూలతోపాటు మొక్క దీని లోపలే పెరుగుతూ చూడముచ్చటగా ఉంటుంది. ఇదేరకమైన స్టేక్స్‌ను టొమాటో మొక్కను పెంచుతున్న తొట్టెకూ అమర్చొచ్చు.

ఇండోర్‌లో...

మనీప్లాంట్‌ వంటి ఇండోర్‌ మొక్కలకు ఆసరా ఇవ్వడానికి ఇనుము, ప్లాస్టిక్‌ లేదా వెదురుతో తయారయ్యే స్టేక్స్‌ వస్తున్నాయి. గుండ్రని, జిగ్‌జాగ్, తేనెపట్టు తదితర డిజైన్లలో ఉంటాయివి. వీటిని తొట్టెలో గుచ్చి మొక్క తీగలను అనుసంధానం చేస్తే చాలు, మొక్క అందంగా అల్లుకుంటూ పెరుగుతుంది. దాని ఎదుగుదలా సరైన రీతిలో సాగుతుంది. అలాగే పెద్దపెద్ద ఆకులున్న క్రోటన్‌ మొక్కకు కాండాలవద్ద గుండ్రని రింగ్‌లాంటిది అమర్చొచ్చు. దీనివల్ల ఆకులన్నీ దగ్గరగా ఉండి వంగకుండా పెరుగుతాయి. ఇండోర్‌ప్లాంట్స్‌లో తీగజాతి మొక్కలను గోడపై అందంగా పెంచడానికి బ్రాస్‌ చెయిన్‌ దొరుకుతోంది. గది గోడలకు పైనుంచి ఈ గొలుసును వేలాడదీసి, దీనికి మొక్కను అటాచ్‌ చేస్తే చాలు. ఇంట్లో కావాల్సినచోట మొక్క అందంగా పాకుతుంది. వీటితోపాటు మెటల్‌ ప్లాంట్‌ ట్రెల్లీస్‌ ఇప్పుడు మార్కెట్‌లో లభ్యమవుతున్నాయి. గులాబీ, మల్లె, మనీప్లాంట్, టొమాటో వంటి మొక్కలన్నింటికీ వీటిని ఉపయోగించుకోవచ్చు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్