ఈ బుట్టని మడతపెట్టొచ్చు...

సాధారణంగా డీప్‌ఫ్రై లాంటివి చేయాల్సి వచ్చినప్పుడు ఒక్కోసారి ఆహార పదార్థాలు విడిపోయి, నూనెంతా పాడవుతుంటుంది. అలాకాకుండా ఉండాలా? అయితే, ఈ డీప్‌ఫ్రై బాస్కెట్‌ను తెచ్చేసుకోండి.

Published : 22 Jun 2024 01:47 IST

సాధారణంగా డీప్‌ఫ్రై లాంటివి చేయాల్సి వచ్చినప్పుడు ఒక్కోసారి ఆహార పదార్థాలు విడిపోయి, నూనెంతా పాడవుతుంటుంది. అలాకాకుండా ఉండాలా? అయితే, ఈ డీప్‌ఫ్రై బాస్కెట్‌ను తెచ్చేసుకోండి. దీంతో ఫ్రెంచ్‌ ఫ్రైస్, చికెన్‌ ఫ్రై... లాంటివి చేసుకోవచ్చు. అంతేకాదు, కూరగాయలను ఉడికించుకోవాల్సి వస్తే, ఇది స్టీమర్‌లానూ పనిచేస్తుంది. పని అయ్యాక, డిటర్జెంట్‌తో శుభ్రపరచుకుని, మెత్తని క్లాత్‌తో తుడిచేస్తే సరి. పైగా ఇది ఫోల్డబుల్‌ ఫ్రైయర్‌ కాబట్టి, భద్రపరచాలంటే ఎక్కువ చోటూ అవసరం లేదు. మడతపెట్టేసి కబోర్డులో చిన్న స్థలంలో కూడా పెట్టుకోవచ్చు. స్టెయిన్‌లెస్‌ స్టీల్‌తో తయారుచేసిన ఇది ఎక్కువకాలం మన్నుతుంది కూడా.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్