పేపర్లు... పోవిక!

పిల్లలు నెమ్మదిగా స్కూలు వాతావరణానికి అలవాటు పడుతున్నారు కదూ! పాఠాలూ మొదలవుతున్నాయి. ఇక ప్రాక్టీసు పేపర్లు, డిక్టేషన్లు అంటూ బ్యాగుల్లోకి కాగితాలు కుప్పలా చేరతాయి.

Published : 19 Jun 2024 01:47 IST

చలో స్కూల్‌

పిల్లలు నెమ్మదిగా స్కూలు వాతావరణానికి అలవాటు పడుతున్నారు కదూ! పాఠాలూ మొదలవుతున్నాయి. ఇక ప్రాక్టీసు పేపర్లు, డిక్టేషన్లు అంటూ బ్యాగుల్లోకి కాగితాలు కుప్పలా చేరతాయి. హడావుడిలో పిల్లలేమైనా సరిగా పెట్టుకుంటారా అంటే అబ్బే... గబగబా మడత పెట్టేసి బ్యాగులోకి తోసేస్తారు. తీరా ఎప్పుడో అవసరమైనప్పుడు ఒక్కోటీ వెదుకుతారు. వాటిలో ఏవి ఉంచాలో వేటిని తీసేయొచ్చో తెలియక మనకీ పెద్ద తలనొప్పే! ఈ క్లిప్‌లను కొని, వాళ్ల స్కూలు బ్యాగులో ఉంచేయండి. ముఖ్యమైన వాటికి ఈ క్లిప్‌లు పెట్టేసుకోమనండి. ఎక్కువ పేజీలుంటే కార్నర్‌ క్లిప్‌లు ఎంచుకోవచ్చు. తక్కువ వాటికి మినీ క్లిప్‌లు సరిపోతాయి. బొమ్మలతో భలే అందంగా ఉన్నాయి కదూ! చక్కగా వాళ్లకీ సర్దుకోవడం అలవాటు అవుతుంది, మనకీ శ్రమ తగ్గుతుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్