ఎక్కువ మాట్లాడుతోంది... సమస్యేనా?

మా పాపకు ఐదేళ్లు. అన్ని విషయాల్లో చురుగ్గానే ఉంటుంది. కానీ ఒక్కోసారి హైపర్‌యాక్టివ్‌గా ఉంటుంది. తొందర తొందరగా పనులు చేయాలని చూస్తుంటుంది.  అతిగా మాట్లాడుతోంది.

Updated : 17 Jun 2024 18:47 IST

మా పాపకు ఐదేళ్లు. అన్ని విషయాల్లో చురుగ్గానే ఉంటుంది. కానీ ఒక్కోసారి హైపర్‌యాక్టివ్‌గా ఉంటుంది. తొందర తొందరగా పనులు చేయాలని చూస్తుంటుంది.  అతిగా మాట్లాడుతోంది. ఇదేమైనా సమస్యా.

ఓ సోదరి

ఐదేళ్ల పిల్లలు నేర్చుకోవడంలోనూ, మిగతా పనుల్లోనూ ఉత్సాహంగా ఉన్నప్పటికీ... తొందరపాటు ఎక్కువగా ఉండడం, దెబ్బలు తగిలించుకోవడం, ఒకచోట స్థిరంగా లేకపోవడం, అతిచురుకు, ఎక్కువ మాట్లాడుతుండడం, అన్నీ చేయాలని ఆరాటపడడం... లాంటివన్నీ అటెన్షన్‌ డెఫిసిట్‌ హైపర్‌యాక్టివిటీ డిజార్డర్‌ లక్షణాలుగా పరిగణించవచ్చు. కడుపుతో ఉన్నప్పుడు కానీ, డెలివరీ సమయంలో పుట్టిన పిల్లలకు ఆక్సిజన్‌ లోపమో, లేదా మరేదైనా చిన్నపాటి సమస్యలు తలెత్తితే, అటువంటి పిల్లలు కొంత ఓవర్‌ యాక్టివ్‌గా ఉంటారు. ఏదిఏమైనా పాపని ఒకసారి సైకియాట్రిస్టుకి చూపించండి. వాళ్లు పిల్లలు పుట్టిన దగ్గర్నుంచి, ఐదేళ్ల వరకూ జరిగిన ఎదుగుదలని పరిశీలిస్తారు. దానిద్వారా ఏడీహెచ్‌డీ ఉందా?లేదా సాధారణమేనా? అనేది నిర్ణయిస్తారు. దాన్నిబట్టి మీకు ఏ విధంగా వాళ్లకు శిక్షణ ఇవ్వవచ్చో చెబుతారు. వాటిని సాధన చేయిస్తే, క్రమంగా సమస్య నయం అవుతుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్