కొబ్బరిచిప్పతో కొత్తగా!

ఆసక్తి ఉండాలే కానీ... ఇంట్లో వృథా ప్లాస్టిక్‌ డబ్బాలను కూడా అందమైన గృహోపకరణాలుగా చేయొచ్చు. కానుకలుగా మార్చొచ్చు.

Updated : 25 Oct 2023 03:53 IST

ఆసక్తి ఉండాలే కానీ... ఇంట్లో వృథా ప్లాస్టిక్‌ డబ్బాలను కూడా అందమైన గృహోపకరణాలుగా చేయొచ్చు. కానుకలుగా మార్చొచ్చు..

ప్లాస్టిక్‌ డబ్బాను తీసుకొని... దాన్ని శుభ్రం చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కొబ్బరితాడు లేదా పురికొసని డబ్బాకు పైన, కింద మూడు వరసలొచ్చేలా జిగురుతో అంటించి ఆరనివ్వాలి. డబ్బా మధ్య భాగమంతా నలుపు రంగు వేయాలి. ఇది ఆరేలోపు కొబ్బరి చిప్పలను చిన్నచిన్న ముక్కలుగా చేసి వాటికీ నలుపు రంగు వేసి అక్కడే జిగురుతో అంటించాలి. ఇవి ఆరాక బ్రష్‌తో వార్నిష్‌ వేస్తే చాలు. ఉడ్‌ లుక్‌తో చక్కటి కుండీ తయారవుతుంది. కొబ్బరి చిప్పల ముక్కలకు బదులుగా రంగురంగుల రాళ్లను కూడా అంటించొచ్చు. వీటిల్లో మట్టిని నింపి నచ్చిన మొక్కల్ని నాటితే సరి. ఆ ప్రదేశమంతా కళకళలాడుతుంది.

కానుకగానూ... పాత గ్లాసు తీసుకుని  దానిచుట్టూ పురికొసని గుండ్రంగా చుడుతూ జిగురుతో అతికించాలి.  మరొక పురికొస తో అక్షరాలు తయారుచేసి వాటిని అంటిస్తే సరిపోతుంది.

ఊలుతో: కుండీ చుట్టూ అందంగా ఊలుతో అల్లిన రంగురంగుల అంచులని అంటిస్తే కొత్తగా కనిపిస్తుంది. అలాగే ఊలు ఉండలను అటాచ్‌ చేసిన వస్త్రాన్ని తొట్టె అంచుల బయటకు వచ్చేలా అంటించినా చాలు. రంగురంగుల ఊలుతో కుండీ అందంగా తయారవుతుంది. వీటిని కానుకలుగానూ ఇవ్వొచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్