బాధ్యత తెలుసుకుని నడిస్తేనే...

జీవితాంతం ఒకరికొకరు తోడూనీడగా సాగాల్సిన కొందరు భార్యాభర్తలు... చిన్న విషయాలకే ఒకరినొకరు తూలనాడటం, నిందించుకోవడం చేస్తుంటారు.

Published : 02 Jul 2024 02:08 IST

జీవితాంతం ఒకరికొకరు తోడూనీడగా సాగాల్సిన కొందరు భార్యాభర్తలు... చిన్న విషయాలకే ఒకరినొకరు తూలనాడటం, నిందించుకోవడం చేస్తుంటారు. ఈ అలవాటు మీ బంధాన్నీ బీటలు వారుస్తుంది. అలాకాకూడదంటే!

సంసారంలో అయినా సమస్యలు సహజం. వాటిని చూసి ఒకరినొకరు నిందించుకోవద్దు. ఇలాంటప్పుడే ఇరువురికీ తోడు అవసరం. కలసికట్టుగా దాటడానికి ఓదార్పు ముఖ్యం. అలా చేయగలిగితే... ఎంతటి కష్టమైనా చిన్నగా అనిపిస్తుంది. ఓ సారి ప్రయత్నించి చూడండి.

  • నిత్యం ఏదో ఒక పనిలో తప్పొప్పులు జరుగుతూనే ఉంటాయి. అయినంత మాత్రాన నా మాట వినలేదు కాబట్టే ఇది జరిగింది. నీకేం తెలియదు అంటూ నిందించేయకండి. బదులుగా దాన్ని సరిదిద్దడానికి సాయం చేయండి.  బయటపడే మార్గాన్ని చూపించి ధైర్యం చెప్పండి. అవతలివారికి తాము చేసిన తప్పు అర్థం కావడమే కాదు... మీపై నమ్మకమూ పెరుగుతుంది. ఇది అనుబంధాన్ని మరింత దృఢ పరుస్తుంది.
  • ఏదైనా మంచి జరిగితే అదంతా తన గొప్పతనం అనుకుంటారు కొందరు. చెడు జరిగిన వెంటనే దాన్ని ఎదుటివారి మీదకు నెట్టేస్తుంటారు. దాన్ని ఒక్కరి మీదే నెట్టేసి, నిందించడం ఎంతవరకు సబబో తెలుసుకోవాలి. కుటుంబాన్ని నెట్టుకురావడంలో, పిల్లల్ని పెంచడంలో ఇద్దరికీ బాధ్యత ఉంటుందని మరిచిపోకూడదు. 
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్