ఆ అమ్మలకీ సెలవిస్తారు!

అద్దెగర్భం ద్వారా బిడ్డను పొందినా... తమ బిడ్డ ఆలనాపాలనా చూసుకోవాలని కలలు కంటారు తల్లిదండ్రులు. వీరు ప్రభుత్వోద్యోగులైతే, వారికి ప్రసూతి సెలవులు మంజూరు చేసే నియమం గత 50 ఏళ్లుగా లేదు. తాజాగా చేసిన ఓ సవరణ ఇప్పుడు వాళ్ల పాలిట వరమైంది.

Published : 29 Jun 2024 01:42 IST

అద్దెగర్భం ద్వారా బిడ్డను పొందినా... తమ బిడ్డ ఆలనాపాలనా చూసుకోవాలని కలలు కంటారు తల్లిదండ్రులు. వీరు ప్రభుత్వోద్యోగులైతే, వారికి ప్రసూతి సెలవులు మంజూరు చేసే నియమం గత 50 ఏళ్లుగా లేదు. తాజాగా చేసిన ఓ సవరణ ఇప్పుడు వాళ్ల పాలిట వరమైంది.

సరోగసీ ద్వారా పిల్లలను కోరుకునే తల్లిదండ్రులను ‘కమిషన్‌ పేరెంట్స్‌’ అని పిలుస్తారు. అలా ఈ తల్లిదండ్రులకు కూడా ఇకపై ప్రసూతి సెలవులున్నాయి. ప్రజా ఫిర్యాదులు, పెన్షన్‌ మంత్రిత్వ శాఖ జారీ చేసిన నోటీసు ప్రకారం చైల్డ్‌ కేర్‌ లీవ్‌తో కూడిన ‘కమిషన్‌ మదర్‌కు 180 రోజులు ప్రసూతి సెలవులు, ఆ కమిషన్‌ తండ్రికి 15 రోజుల పితృత్వ సెలవు మంజూరైంది. అయితే ఈ సవరణకు ప్రభుత్వ ఉద్యోగులు మాత్రమే అర్హులు అవుతారు. ఇప్పటివరకు అద్దె గర్భంద్వారా బిడ్డను కన్న ప్రభుత్వ మహిళా ఉద్యోగులకు ప్రసూతి సెలవులు మంజూరు చేసే నిబంధన లేదు. తాజాగా చేసిన ఈ సవరణతో కమిషన్‌ కపుల్‌కు ఉపశమనం అందింది. అలాగే సరోగసీ ద్వారా పుట్టిన బిడ్డకు కమిషన్‌ తండ్రి తన పితృత్వ సెలవును ప్రసవించిన ఆరునెలల వ్యవధిలో వినియోగించుకోవాల్సి ఉంటుంది. సరోగసీని ఎంచుకునే మహిళలు సహజంగా ప్రసవించేవారితో సమానమైన ప్రసూతి ప్రయోజనాలను పొందే అవకాశాన్ని ఈ సవరణ అందించింది. అలాగే ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం- మహిళ, ఒంటరి ప్రభుత్వోద్యోగులైన మగవారు తమ మొత్తం పదవీ కాలంలో 730 రోజుల వరకు పిల్లల సంరక్షణ సెలవు తీసుకోవచ్చు. తమ ఇద్దరి పిల్లల విద్య, అనారోగ్యం వంటి వివిధ అవసరాల కోసం ఈ సెలవులను వినియోగించుకోవచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్