బ్రేకప్‌ చెబుతున్నారా?

లావణ్య, అవినాష్‌ చిన్నప్పటి నుంచి స్నేహితులు. ఆ స్నేహం ప్రేమగా మారడంతో పెళ్లితో ఒకటవ్వాలనుకున్నారు. అయితే అప్పటివరకు ఏ విషయాన్నైనా ఒకేలా ఆలోచించే వాళ్లిద్దరూ వివాహం చేసుకోవాలనేటప్పటికి భిన్న ధ్రువాలుగా మారారు. విభేదాలు పెరగడంతో బ్రేకప్‌ చెప్పుకొన్నారు. అలాగే ప్రేమ వివాహంతో ఒక్కటైనా... రమణి, యోగానంద్‌ ఏడాదిలోపే దూరమయ్యారు.

Updated : 27 Jun 2024 07:13 IST

లావణ్య, అవినాష్‌ చిన్నప్పటి నుంచి స్నేహితులు. ఆ స్నేహం ప్రేమగా మారడంతో పెళ్లితో ఒకటవ్వాలనుకున్నారు. అయితే అప్పటివరకు ఏ విషయాన్నైనా ఒకేలా ఆలోచించే వాళ్లిద్దరూ వివాహం చేసుకోవాలనేటప్పటికి భిన్న ధ్రువాలుగా మారారు. విభేదాలు పెరగడంతో బ్రేకప్‌ చెప్పుకొన్నారు. అలాగే ప్రేమ వివాహంతో ఒక్కటైనా... రమణి, యోగానంద్‌ ఏడాదిలోపే దూరమయ్యారు. బ్రేకప్‌ చెప్పడం లేదా విడిపోవడంపై నిపుణులేం చెబుతున్నారంటే...

ప్రేమబంధంలో ఉన్నప్పుడు అభిప్రాయభేదాలు లేనట్లు కనిపిస్తుంది. ఎదుటివారు చెప్పే ప్రతిదాన్నీ ఆమోదిస్తారు. తీరా అది వైవాహిక బంధంగా మారేటప్పటికి అప్పటివరకు స్నేహితులుగా ఉన్నవారిద్దరి ఆలోచనాతీరుపై పరిస్థితుల ప్రభావం పడుతుంది. స్నేహంలో ఇద్దరే ఉంటారు. బాధ్యతలుండవు. అయితే పెళ్లి అనేసరికి ఇరు కుటుంబాలు, వేరువేరు సంప్రదాయాలతో ముడిపడి ఉంటుంది. కొత్త బాధ్యతలొస్తాయి. తల్లిదండ్రులూ, తోబుట్టువుల అభిప్రాయాలనూ ఆ ఇద్దరూ గౌరవించాల్సి ఉంటుంది. పెళ్లి కాకుండానే ఇవన్నీ వారి ఆలోచనాతీరును మారుస్తాయి. స్నేహంగా ఉన్నప్పుడు అవతలివ్యక్తి తీరు ఒకలా కనిపించి, తీరా పెళ్లి అనేసరికి ఆ తీరు మారినట్లుగా అనిపించడం ఎదుటివారిని ఇబ్బంది పెడుతుంది. ఇప్పుడే ఇలా ఉంటే పెళ్లైన తర్వాత మరెన్ని సమస్యలొస్తాయో అనే భయం ఆ ఇద్దరినీ ఏడడుగులు వేయకుండానే విడిపోయేలా చేస్తుంది.

పెళ్లైతే...

వైవాహికబంధంలోకి అడుగుపెట్టేటప్పుడు నూతన దంపతులు తమ భవిష్యత్తును రంగులప్రపంచంగా ఊహించుకుంటారు. ఎలాంటి సమస్య వచ్చినా, కలిసి పరిష్కరించుకుందామని కలలు కంటారు. అలాగే అనుకోని సమస్యలెదురైనప్పుడు దంపతులిద్దరూ కలిసి సమన్వయం చేస్తారు. అయితే ఆ సమస్యలెక్కువైనప్పుడు మాత్రం బరువు మోయలేకపోతారు. తాము ఊహించిన జీవితం అది కాదనే నిరాశకు లోనవుతారు. అక్కడితో ఆ బంధం నుంచి బయటపడాలనుకుంటారు. అలాకాకుండా ఇరువురిలో ఏ ఒక్కరైనా సరైన రీతిలో ఆలోచించి సమన్వయం చేయడానికి ప్రయత్నిస్తే వివాహబంధాన్ని కలకాలం నిలుపుకోవచ్చు అంటున్నారు నిపుణులు. పెళ్లికి ముందు ఉన్న స్నేహాన్ని కొనసాగిస్తూ ఒకరిని ఒకరు గౌరవించుకుంటే చాలు. ఏ సమస్య అయినా అశాశ్వతమే అవుతుంది. సహనాన్ని పాటిస్తే, ఊహించినట్లుగా జీవితాన్ని తీర్చిదిద్దుకోవచ్చు. బ్రేకప్‌కు అవకాశం లేకుండా చేయొచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్