పెద్దమ్మాయికి బాధ్యత ఎక్కువే...

చిన్నదానికి దెబ్బ తగిలింది, కూడా ఉన్నావుగా.. చూసుకోలేదా... అంటూ ఇంట్లో పెద్ద పిల్లలను అజమాయిషీ చేస్తారంతా. తీరా చెల్లెలికన్నా పెద్దమ్మాయిది రెండేళ్లు ఎక్కువ ఉంటుంది. అయినా చిన్నవాళ్ల బాధ్యత పెద్దవాళ్లదే అంటారంతా. దీంతోపాటు పుట్టిన క్రమం పిల్లల వ్యక్తిత్వాన్ని గణనీయంగా ప్రభావితం చేస్తుందంటున్నాయి పలు పరిశోధనలు. 

Updated : 26 Jun 2024 02:45 IST

చిన్నదానికి దెబ్బ తగిలింది, కూడా ఉన్నావుగా.. చూసుకోలేదా... అంటూ ఇంట్లో పెద్ద పిల్లలను అజమాయిషీ చేస్తారంతా. తీరా చెల్లెలికన్నా పెద్దమ్మాయిది రెండేళ్లు ఎక్కువ ఉంటుంది. అయినా చిన్నవాళ్ల బాధ్యత పెద్దవాళ్లదే అంటారంతా. దీంతోపాటు పుట్టిన క్రమం పిల్లల వ్యక్తిత్వాన్ని గణనీయంగా ప్రభావితం చేస్తుందంటున్నాయి పలు పరిశోధనలు. 

సంతానంలో పిల్లలు పుట్టే క్రమం వారి స్వభావం, ప్రవర్తనను ప్రభావితం చేస్తాయంటున్నాయి అధ్యయనాలు. అందరికన్నా పెద్దవాళ్లు కుటుంబంలో బాధ్యతగా, నాయకత్వ స్థానంలో ఉంటారు. తల్లిదండ్రుల ఏకాగ్రత, అడిగిందల్లా పొందడం వంటివన్నీ ముందుగా వీరికే దక్కుతాయి. దీంతో అందరి ప్రేమ దక్కి తాము కూడా స్నేహభావంతో ఉంటారు. తన తర్వాత పుట్టిన పిల్లల బాధ్యత రావడంతో బాధ్యతాయుతంగా మారతారు. తమ్ముడు అల్లరి చేస్తే తప్పు అని చెప్పాలి కదా అనే తల్లిదండ్రుల మాటలతో తనకన్నా చిన్నవారికి తాను రోల్‌మోడల్‌గా ఉండాలనే వ్యక్తిత్వం వస్తుంది.    

మధ్యవాళ్లు...

తనకన్నా పెద్దవాళ్లు, చిన్నవాళ్లకు మధ్య సమతుల్యంగా ఉంటారు. తమకంటూ గుర్తింపు పొందడానికి కృషి చేస్తూ, నైపుణ్యాలను పెంచుకుంటారు. తమకన్నా పెద్దవారికి, చిన్నవారికి సహకారాన్ని అందిస్తూ, వాళ్ల మధ్య వచ్చే విభేదాలకు మధ్యవర్తిత్వం వహిస్తారు. ఇక, చివరి పిల్లలు పుట్టే సమయానికి తల్లిదండ్రులకు పెంపకంలో అనుభవం వస్తుంది. ఒత్తిడికి గురికాకుండా పెంచడంవల్ల ఈ పిల్లల్లో ఆందోళన ఉండదట. అందరి  ప్రేమ పొంది గారంగా పెరుగుతారు. నిర్లక్ష్య వైఖరి వస్తుంది. నియమాలు, నిబంధనలు సడలి సాహసోపేతంగా ఉంటారు.

ఒకే ఒక్కరైతే...

తల్లిదండ్రుల నుంచి ఎక్కువ ప్రేమ దొరుకుతుంది.  పోటీ లేకుండా పెరుగుతారు. మనసుకు నచ్చింది చేస్తారు.  అమ్మానాన్నతో ఎక్కువ గడుపుతారు. అయితే అనుకున్నది అందకపోతే తీవ్రమైన ఒత్తిడికి గురవుతారు. ఉన్నతవిద్యను అభ్యసించడంలో, సామాజిక నైపుణ్యాలను పెంపొందించుకోవడంలో ముందుంటారట. పిల్లల వరుసక్రమం ప్రకారం కాకుండా, ప్రతి సంతానం వ్యక్తిగత బలాలను పెంపొందించేలా తల్లిదండ్రులు మద్దతు అందించగలిగితే వాళ్ల వ్యక్తిత్వాన్ని సరైన రీతిలో మలచొచ్చు అంటున్నారు నిపుణులు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్