గుర్తించొచ్చు... చెరిపేయొచ్చు!

పాఠం చెప్పేటప్పుడు ‘ఇది ముఖ్యమైన పాయింట్‌’ అని టీచర్లు గుర్తు చేస్తుంటారు. సులువుగా గుర్తుపట్టేలా పిల్లలనీ పెన్సిల్‌ లేదా పెన్నుతో గుర్తు పెట్టమనడం మనకీ తెలిసిందే! ఇప్పుడున్నది మోడరన్‌ తరం కదా! వాళ్లకోసం లేత రంగుల్లో హైలైటర్లు వచ్చాయి.

Published : 24 Jun 2024 01:46 IST

పాఠం చెప్పేటప్పుడు ‘ఇది ముఖ్యమైన పాయింట్‌’ అని టీచర్లు గుర్తు చేస్తుంటారు. సులువుగా గుర్తుపట్టేలా పిల్లలనీ పెన్సిల్‌ లేదా పెన్నుతో గుర్తు పెట్టమనడం మనకీ తెలిసిందే! ఇప్పుడున్నది మోడరన్‌ తరం కదా! వాళ్లకోసం లేత రంగుల్లో హైలైటర్లు వచ్చాయి. ఇప్పుడు వాటిదే హవా. ఆకర్షణీయంగా ఉంటాయని పిల్లలూ అవే కావాలి అని పట్టుబడుతున్నారు. అంతా బాగానే ఉంది కానీ... పెన్నుతో తప్పుగా గీత గీస్తే మనం ఎంత ఇబ్బంది పడిపోయేవాళ్లం? హైలైటర్లతోనూ ఇదే పరిస్థితి. పొరపాటున ఏమరపాటుతో తప్పుగా గుర్తించారో... ఇబ్బంది పడాలి. కంగారు వద్దులెండి. ఎరేజబుల్‌ హైలైటర్లతో ఈ సమస్యకీ పరిష్కారం వచ్చింది. ఇవనుకోండి... వెనక ఎరేజర్‌ లాంటిది ఉంటుంది. పొరపాటుగా గీసినా... దాంతో చక్కగా తుడిపేసుకోవచ్చు. ఎంత పెద్దవి తెచ్చినా అయిపోగొట్టేస్తున్నారు అనిపిస్తే చిన్నవి, పూలు, పెన్సిల్‌ వంటి భిన్న రూపాల్లో ఉన్నవీ దొరుకుతున్నాయి. వాటిని తెచ్చినా సరే! అయితే ఎరేజ్‌ చేసే అవకాశముందా అని చూసుకుంటే చాలు. పెద్ద ఇబ్బంది తప్పలేదూ?

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్