విరగ్గొట్టేస్తున్నారా?

చాలా అవసరం, లేకపోతే పనే జరగదు అన్నట్లు పిల్లలు స్కేళ్లను తెగ కొంటారు ... అంత మారాం చేసి కొనిపించుకుంటారా... ఎన్ని రోజులు ఉంచుతారు? ఒక్కోసారి రెండు రోజుల్లోనే రెండు ముక్కలు చేసి చేతిలో పెడతారు.

Published : 22 Jun 2024 01:48 IST

చలో స్కూల్‌

చాలా అవసరం, లేకపోతే పనే జరగదు అన్నట్లు పిల్లలు స్కేళ్లను తెగ కొంటారు ... అంత మారాం చేసి కొనిపించుకుంటారా... ఎన్ని రోజులు ఉంచుతారు? ఒక్కోసారి రెండు రోజుల్లోనే రెండు ముక్కలు చేసి చేతిలో పెడతారు. పైగా ‘పౌచ్‌లో పెడితే విరిగింది, పక్కనవాడు విరగ్గొట్టాడు’ అని బోలెడు కబుర్లు చెబుతారు. ఆటలాడుతూనో, చూడకుండా తొక్కో విరిగేవీ ఎక్కువే. తరవాతేంటి... మళ్లీ కథ మొదటికే... ఇంకోటి కావాలంటూ ఏడుపు. ఇలా ఎన్నని కొంటాం చెప్పండి? అలాగని కొనకుండానూ ఊరుకోలేం. అందుకే... ఈ ‘ఫ్లెక్సిబుల్‌’ లేదా ‘బెండబుల్‌’ రూలర్స్‌ని తెచ్చేయండి. భిన్నరంగుల్లో, కార్టూన్‌ రూపాల్లో చూడటానికి అందంగా ఉండటమే కాదు... ఏం చేసినా త్వరగా విరగవు. కొన్నింటినైతే బ్రేస్‌లెట్‌లానూ  పెట్టుకోవచ్చు. హమ్మయ్యా... ఒక బాధ తప్పిందని మీకూ అనిపిస్తోందా? అయితే వెదికేయండి. ఆన్‌లైన్‌ వేదికల్లో దొరుకుతున్నాయి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్