చలో స్కూల్‌ చిన్నవి... చాలు!

అక్షరాలు రాకపోయినా పిల్లలు బొమ్మలు గీయడం, రంగులు వేయడం వంటివి ఎంచక్కా చేసేస్తారు. ప్రీస్కూల్లోనే వీళ్లకి ఇవి పరిచయం అవుతున్నాయి. అంటే పెన్సిల్‌ ఎంతముఖ్యమో రంగు పెన్సిళ్లు, క్రేయాన్లూ అంతే అవసరమనేగా! మనమేమో... ‘అరెరే ఎంత చక్కగా బొమ్మలు గీస్తున్నారో, ఎంత ముచ్చటగా రంగులద్దుతున్నారో’ అని పెద్ద పెద్ద కలరింగ్‌ బాక్సులు కొని తెచ్చేస్తాం.

Published : 21 Jun 2024 01:57 IST

క్షరాలు రాకపోయినా పిల్లలు బొమ్మలు గీయడం, రంగులు వేయడం వంటివి ఎంచక్కా చేసేస్తారు. ప్రీస్కూల్లోనే వీళ్లకి ఇవి పరిచయం అవుతున్నాయి. అంటే పెన్సిల్‌ ఎంతముఖ్యమో రంగు పెన్సిళ్లు, క్రేయాన్లూ అంతే అవసరమనేగా! మనమేమో... ‘అరెరే ఎంత చక్కగా బొమ్మలు గీస్తున్నారో, ఎంత ముచ్చటగా రంగులద్దుతున్నారో’ అని పెద్ద పెద్ద కలరింగ్‌ బాక్సులు కొని తెచ్చేస్తాం. వాళ్లేమో అన్నింటినీ కలగాపులగం చేస్తారు. అంతటితో ఆగుతారా? ఎంత ఖర్చు పెట్టి కొన్నవైనా వాళ్లకి కొద్దిరోజుల్లోనే బోర్‌ కొట్టేస్తాయి.

వాటిని విరిచేయడం, పడేయడం సరేసరి. ఒక్క రంగు లేకపోయినా మళ్లీ బాక్సు అంతా కొనాల్సిందే. ఆ పాత వాటిని వేయడానికి మళ్లీ ఓ డబ్బా వెతకాలి. ఎందుకొచ్చిన శ్రమ ఇదంతా? పైగా డబ్బులూ వృథా. వీటన్నింటికీ ‘మినీ’నే ఉపాయం. ఏం లేదండీ... కలర్‌ పెన్సిళ్లు, క్రేయాన్స్‌ చిట్టి సైజుల్లో దొరుకుతాయి. వాటిని తెచ్చేయండి. ఇవైతే చక్కగా డబ్బాల్లోనూ వస్తాయి. పనయ్యాక వాళ్లే దానిలో సర్దుకుంటారు. ఖర్చూ తక్కువే కాబట్టి, పోగొట్టినా, బోర్‌ కొట్టాయన్నా కొనడానికి మనకీ ఇబ్బంది అనిపించదు. ఏమంటారు? 

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్