తినేవి కాదు... చెరిపేసేవి!

‘ఒక ఎరేజర్‌ ధరెంత? మహా అయితే అయిదు రూపాయలు. పోగొట్టారని పిల్లల్ని అరవాలా?’ ప్రతి ఇంట్లోనూ ఈ మాట వినిపిస్తుంటుంది కదా! పొరపాటున పోతే ఏమీ చేయలేం కానీ... కొందరు పిల్లలుంటారు. దాంతో ఏదో వైరం ఉన్నట్లే గోరుతో గీకేస్తూ ఉంటారు.

Published : 18 Jun 2024 01:09 IST

‘ఒక ఎరేజర్‌ ధరెంత? మహా అయితే అయిదు రూపాయలు. పోగొట్టారని పిల్లల్ని అరవాలా?’ ప్రతి ఇంట్లోనూ ఈ మాట వినిపిస్తుంటుంది కదా! పొరపాటున పోతే ఏమీ చేయలేం కానీ... కొందరు పిల్లలుంటారు. దాంతో ఏదో వైరం ఉన్నట్లే గోరుతో గీకేస్తూ ఉంటారు. అందుకే ఎన్నిసార్లు కొత్తది ఇచ్చినా కొన్నిరోజుల్లోనే మాయమైపోతుంది. మన సమస్య పోవడంతోనే ఆగిపోతుందా ఏంటి? ‘ఎరేజర్‌ లేదు... పక్కనవాడు ఇవ్వలేదు. అందుకే రాయలేదు’ అని బోలెడంత క్లాస్‌వర్క్‌ పోగేసుకుని వస్తారు. మళ్లీ వాళ్లతో అదంతా పూర్తిచేయించడం మనకి అదనపు పని. ఈ తిప్పలన్నీ పోగొట్టేలా ఈ టాయ్‌ ఎరేజర్లను తెప్పించండి. చూడటానికి క్యూట్‌గా అచ్చమైన క్యారెట్, ఐస్‌క్రీమ్, క్యాండీల్లాగే ఉంటాయి. వీటిని చూసుకుని పిల్లలు మురిసిపోవడమే కాదు, జాగ్రత్తగానూ దాచుకుంటారు. పొరపాటు రాసినా... తుడవడానికి వెనకాడరు. ఇలా మనకీ కొన్ని తిప్పలు తప్పుతాయి. ఏమంటారు?

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్