సువాసనల రోజ్‌మేరీ!

సన్నటి ఈనెల్లాంటి ఆకులతో... గాఢమైన పరిమళాన్ని పంచే మొక్క రోజ్‌మేరీ. మధ్యధరా వంటకాల్లో ఎక్కువగా వాడే ఈ ఆకులకు, కొమ్మలకు ఆరోగ్య ప్రయోజనాలెక్కువట.

Published : 30 Jun 2024 01:56 IST

సన్నటి ఈనెల్లాంటి ఆకులతో... గాఢమైన పరిమళాన్ని పంచే మొక్క రోజ్‌మేరీ. మధ్యధరా వంటకాల్లో ఎక్కువగా వాడే ఈ ఆకులకు, కొమ్మలకు ఆరోగ్య ప్రయోజనాలెక్కువట. అందుకే వీటితో చేసే హెర్బల్‌టీ తాగమంటున్నారు పోషకాహార నిపుణులు. 

  • తాజా రోజ్‌మేరీ ఆకులతో పాటు ఎండిన వాటితో టీ తయారు చేసుకుని తాగొచ్చు. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు, ఫాలీఫెనాల్స్‌... జీర్ణశక్తికి తోడ్పడి ఎంజైమ్‌ల ఉత్పత్తిని ప్రేరేపిస్తాయి. అజీర్తి, ఉబ్బరం, గ్యాస్‌ వంటివి అదుపు చేస్తాయి. జీవక్రియల్ని వేగాన్ని పెంచుతాయి. అంతేకాదు, అతిగా తినే అలవాటుతో పాటు బరువుని తగ్గించే గుణాలూ దీనికి ఉన్నాయి. 
  • రోజ్‌మేరీలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా వీటిల్లోని రోస్మరినిక్‌ యాసిడ్, కార్నోసిక్‌ యాసిడ్‌ చాలా శక్తిమంతమైనవి. ఇవి శరీరానికి హానికలిగించే ఫ్రీరాడికల్స్‌తో పోరాడతాయి. దాంతో వ్యాధుల ముప్పూ తగ్గుతుంది. ఈ మూలికా మొక్కలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు అధికం. ఒంట్లోని వాపుల్నీ, కీళ్లూ, కండరాల నొప్పుల్ని తగ్గించే సుగుణాలు ఇందులో ఉన్నాయి. నొప్పుల్నీ నియంత్రిస్తాయి.    
  • మనసు అలజడిగా ఉన్నప్పుడో, పని ఒత్తిడితో అలసటగా అనిపించినప్పుడో ఓ కప్పు రోజ్‌మేరీ చాయ్‌ తాగి చూడండి. ఎంత హాయిగా ఉంటుందో! ఇందులో పుష్కలంగా ఉండే థయామిన్‌ నరాల పనితీరుని మెరుగుపరుస్తుంది. హాయిగా నిద్రా పడుతుంది. 

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్