హాకినితో... చురుగ్గా!

పని ఒత్తిడివల్లో ఏమోకానీ చాలా ముఖ్యం అనుకున్న విషయాలని కూడా మరిచిపోయి... తీరిగ్గా అరెరె అని బాధపడతాం. అదే ఈ హాకిని ముద్రని సాధన చేసి చూడండి. బుర్ర పాదరసంలా పనిచేస్తుంది...

Published : 29 Jun 2024 01:41 IST

పని ఒత్తిడివల్లో ఏమోకానీ చాలా ముఖ్యం అనుకున్న విషయాలని కూడా మరిచిపోయి... తీరిగ్గా అరెరె అని బాధపడతాం. అదే ఈ హాకిని ముద్రని సాధన చేసి చూడండి. బుర్ర పాదరసంలా పనిచేస్తుంది...

హాకిని అంటే శక్తి లేదా పాలన అని అర్థం. ఇది అత్యంత శక్తిమంతమైన ముద్ర. పద్మాసనం లేదా సుఖాసనంలో సౌకర్యవంతంగా కూర్చోవాలి. అరచేతులని ముందుగా నమస్కార ముద్రలో ఉంచి... ఆ తరవాత రెండుచేతుల వేళ్ల చివర్లని మాత్రమే కలిపి ఉంచాలి. మరీ ఒత్తిడి తీసుకురాకుండా సున్నితంగా కలిపి ఉంచితే వేళ్ల చివర ఆ రక్తప్రసరణ వేగం మనకి తెలుస్తుంది. నెమ్మదిగా శ్వాసపై ధ్యాస ఉంచి, కనుబొమల మధ్యలో దృష్టిని నిలపాలి. పావుగంటపాటు ఈ హాకిని ముద్ర సాధన చేయాలి. దీన్ని చేసేటప్పుడే ఖేచరీ ముద్రను కూడా చేయొచ్చు. ఖేచరి అంటే నాలుకని మడతపెట్టి అంగిటను తాకించాలి. ప్రతి శ్వాసకూ మధ్యలో విశ్రాంతి తీసుకోవాలి. ఈ ముద్ర మెదడుకి విశ్రాంతిని ఇస్తుంది. జ్ఞాపకశక్తిని పెంచుతుంది. పిల్లలు చేస్తే చదువులో చురుగ్గా ఉంటారు.

శిరీష, యోగ గురు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్