పోనీ ఇలా తాగండి!

శరీరం చురుకుగా ఉండాలన్నా... అందమైన మేని సొంతం అవ్వాలన్నా రోజూ తగినన్ని నీటిని తీసుకోవడం తప్పనిసరి. ఒక్కసారి పనిలో పడితే చాలు... తలమునకలైపోతారు మనలో చాలామంది. ఇక నీళ్లేం గుర్తుంటాయి. మీరూ ఇదే బాపతా? అయితే... ఇలా ప్రయత్నించి చూడండి.

Published : 28 Jun 2024 02:37 IST

శరీరం చురుకుగా ఉండాలన్నా... అందమైన మేని సొంతం అవ్వాలన్నా రోజూ తగినన్ని నీటిని తీసుకోవడం తప్పనిసరి. ఒక్కసారి పనిలో పడితే చాలు... తలమునకలైపోతారు మనలో చాలామంది. ఇక నీళ్లేం గుర్తుంటాయి. మీరూ ఇదే బాపతా? అయితే... ఇలా ప్రయత్నించి చూడండి.

  • ఇంట్లో ఉన్నా, ఎక్కడికైనా వెళుతున్నా... వెంట వాటర్‌ బాటిల్‌ తప్పనిసరి అన్న నియమం పెట్టుకోండి. అది కళ్ల ముందు ఉంటే అదే మీకు నీళ్లు తాగాలన్న విషయాన్ని గుర్తుచేస్తుంది. దాన్నీ గమనించుకోవట్లేదు అనిపిస్తోందా? అయితే ఎన్నిగంటలకు ఎన్ని నీళ్లు తాగాలో సూచించే బాటిళ్లు వస్తున్నాయి. వాటిని కొనుక్కోండి. ఫిట్‌నెస్‌ యాప్‌ని వేసుకుంటే సరి. ఓ రిమైండర్‌ పెట్టుకుంటే అదే గుర్తుచేస్తూ ఉంటుంది.
  • అస్తమానూ నీళ్లే తాగాలంటే బోర్‌ కొట్టడం ఖాయం. దానిలో నారింజ, నిమ్మ, కీర, ఖర్జూర, ఎండుద్రాక్ష వంటివాటిల్లో నచ్చినవి వేసి ఉంచండి. కావాల్సిన పోషకాలు అందడమే కాదు... తాగాలనే ఉత్సాహం కలుగుతుంది. మజ్జిగ, పాలు, జ్యూస్, కొబ్బరినీళ్లు... ఇలా ప్రయత్నించినా మంచిదే.
  • పుచ్చకాయ, కీర, బత్తాయి, నారింజ... వంటి నీరు సమృద్ధిగా ఉండే పండ్లను తీసుకోండి. ఇవీ శరీరానికి కావాల్సిన నీళ్లని భర్తీ చేస్తాయి. 
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్