ప్రసవ సమయంలో... తినొచ్చా?

నేనిప్పుడు తొమ్మిదో నెల గర్భవతిని. ఆరోగ్యపరమైన సమస్యలు ఏమీ లేవు. డాక్టర్‌ కూడా నో రిస్క్‌ ప్రెగ్నెన్సీ అన్నారు. అయితే, నాకో సందేహం... ప్రసవ సమయంలో ఆహారం ఏమైనా తీసుకోవచ్చా? చాలామంది 7, 8 గంటల ముందు నుంచే ఏమీ తీసుకోకూడదు అని చెబుతున్నారు? నిజమేనా?

Updated : 27 Jun 2024 14:42 IST

నేనిప్పుడు తొమ్మిదో నెల గర్భవతిని. ఆరోగ్యపరమైన సమస్యలు ఏమీ లేవు. డాక్టర్‌ కూడా నో రిస్క్‌ ప్రెగ్నెన్సీ అన్నారు. అయితే, నాకో సందేహం... ప్రసవ సమయంలో ఆహారం ఏమైనా తీసుకోవచ్చా? చాలామంది 7, 8 గంటల ముందు నుంచే ఏమీ తీసుకోకూడదు అని చెబుతున్నారు? నిజమేనా?

స్రవంతి, వైజాగ్‌

పిల్లలకు జన్మనివ్వడం అనేది ఒక హై ఎనర్జీ యాక్టివిటీ. అందుకే, ప్రసవమయ్యే సమయంలో గర్భిణులు సరైన డైట్‌ తీసుకోవడం చాలా అవసరం. ముఖ్యంగా అధిక మోతాదులో కెలొరీలు, ఇతర పోషకాలు ఉండే ఆహారం తీసుకోవడంతో పాటు  మంచినీళ్లు తగినన్ని తాగాలి. దీనివల్ల నొప్పులు పడే సమయం తగ్గుతుంది. ఈ విషయాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదికలు చెబుతున్నాయి. దీన్ని అనుసరించి ప్రధానంగా తేలికగా జీర్ణమయ్యేవి తినాలి. బిస్కెట్లు, శాండ్‌విచ్‌లు, అరటిపండు జ్యూస్, జావ లాంటివి తీసుకోవచ్చు. అయితే కొవ్వు ఎక్కువగా ఉండే మాంసాహారం, కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉండే శీతల పానీయాలు, అసిడిటీకి కారణమయ్యే డెయిరీ ఉత్పత్తులు అస్సలు తీసుకోకూడదు. నొప్పులు మొదలయినప్పుడు ప్రతి పదిహేను నిమిషాలకోసారి జ్యూస్, కొబ్బరినీళ్లు తీసుకుంటూ శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచాలి. ప్రతి గంటన్నరకు ఒకసారి పైన చెప్పిన తేలిగ్గా జీర్ణమయ్యే స్నాక్స్‌ తీసుకోవాలి. ఇక, హైరిస్క్‌ ప్రెగ్నెన్సీ ఇబ్బందులు ఉన్నవారు అంటే.... కవల పిల్లలకు జన్మనివ్వబోయే వారు, మొదటి కాన్పులో సిజేరియన్లు జరిగినవారు, ఇతర అనారోగ్య సమస్యలు ఉన్నవారు మాత్రం వైద్యుల సలహా మేరకే తినాలి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్