తేనీటితో... తగ్గొచ్చా?

సాధారణంగా బరువు తగ్గడానికి భోజనాన్ని తగ్గించడమో, వ్యాయామం చేయడమో చేస్తుంటాం. కానీ, ఈ మధ్య కొన్నిరకాల టీలు తాగితే కూడా వెయిట్‌ తగ్గొచ్చనే ప్రచారం పెరిగింది. అయితే ఇది పూర్తిగా నిజం కాదంటారు నిపుణులు. సాధారణంగా భోజనానికి ముందో, తరవాతో ద్రవ పదార్థాలను తీసుకోవడం వల్ల కడుపు నిండిన భావన కలుగుతుంది.

Published : 27 Jun 2024 01:33 IST

సాధారణంగా బరువు తగ్గడానికి భోజనాన్ని తగ్గించడమో, వ్యాయామం చేయడమో చేస్తుంటాం. కానీ, ఈ మధ్య కొన్నిరకాల టీలు తాగితే కూడా వెయిట్‌ తగ్గొచ్చనే ప్రచారం పెరిగింది. అయితే ఇది పూర్తిగా నిజం కాదంటారు నిపుణులు. సాధారణంగా భోజనానికి ముందో, తరవాతో ద్రవ పదార్థాలను తీసుకోవడం వల్ల కడుపు నిండిన భావన కలుగుతుంది. దీనివల్ల మనం తినాలనుకున్న ఆహార పరిమాణం తగ్గుతుంది. ఇలా కొన్ని రోజులు చేస్తే కొంత బరువు తగ్గినట్లే కనిపిస్తుంది. కానీ, శరీరంలోని కొవ్వు నిల్వలు కరిగినట్లు కాదట. అలానే, కౌచ్‌ గ్రాస్, బుచు, డాండలైన్, ఉవాఉర్సి, బ్రూమ్‌ వంటి కొన్ని రకాల టీలలోని పోషకాలు... ఒంట్లోని అదనపు నీటిని మూత్రం రూపంలో బయటకు పంపిస్తాయి. దీనివల్లా సన్నబడ్డామేమో అనిపిస్తుంది. అయితే, గ్రీన్, బ్లాక్, ఉలాంగ్‌ టీలలో ఉండే కొన్నిరకాల సమ్మేళనాలు శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచేందుకు సాయపడతాయి. అయితే, తక్కువ కాలంలో బరువు తగ్గడానికి మాత్రం పనికిరావు. సమతులాహారాన్ని తీసుకోవడం, తగినంత నిద్రపోవడం, కనీసం రోజూ ఓ గంటైనా వ్యాయామం చేయడం వంటివి చేస్తూనే ఈ టీలు తాగితే ఆరోగ్యకరంగా బరువుని తగ్గించుకోవచ్చట.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్