Corn silk tea: మొక్క జొన్న పీచుతో టీ

మొక్కజొన్న అంటే అందరికీ ఇష్టమే.ఈ కాలంలో విరివిగా దొరికే ఇవి రుచితోనే కాదు ఆరోగ్యంలోనూ ఎంతో ఉపయోగపడతాయి. మనకు తెలియని విషయం వాటిని ఒలిచిన తర్వాత వచ్చే పీచులో కూడా అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయట.

Updated : 16 Aug 2023 08:34 IST

మొక్కజొన్న అంటే అందరికీ ఇష్టమే.ఈ కాలంలో విరివిగా దొరికే ఇవి రుచితోనే కాదు ఆరోగ్యంలోనూ ఎంతో ఉపయోగపడతాయి. మనకు తెలియని విషయం వాటిని ఒలిచిన తర్వాత వచ్చే పీచులో కూడా అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయట. మొక్కజొన్న పీచులో క్యాల్షియం, విటమిన్‌ బీ2, సీ, కేలు అధికంగా ఉంటాయి. ఈ పీచుతో టీ కాచుకుని కూడా తాగొచ్చు.

కిడ్నీలను డిటాక్స్‌ చేసుంది.. మొక్కజొన్న పీచు మూత్రపిండాలకు దివ్యౌషధంలా పని చేస్తుంది. ఇది కిడ్నీలో ఉండే ప్రమాదకరమైన టాక్సిన్లు తొలగించి, రాళ్లు తొలగించడానికి ఉపయోగపడతాయి. మొక్కజొన్న పీచుతో తయారు చేసిన టీ తాగితే మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడకుండా నియంత్రించవచ్చు.

యూరిన్‌ ఇన్‌ఫెక్షన్‌.. దీనిలో యాంటీఇన్‌ఫ్లెమేటరీ గుణాలు మెండుగా ఉంటాయి. ఇది మూత్రనాళంలో మంటను తగ్గిస్తుంది. అలాగే మూత్రంలో బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది. శరీరంలోని విషపదార్థాలను బయటకు పంపి ప్రోస్టేట్‌ గ్రంధిని ఆరోగ్యంగా ఉంచుతుంది.

షుగర్‌... మొక్కజొన్న పీచులో ఫైబర్‌, విటమిన్లు, మినరల్సు పుష్కలంగా ఉంటాయి. అందువల్ల రక్తంలోని చక్కెర స్థాయిని పెరగనివ్వవు. అంతే కాదు రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రణలో ఉంచే ఇన్సులిన్‌ హార్మోన్‌ను నియంత్రించే గుణాలు దీనిలో మెండుగా ఉన్నాయి. మధుమేహం ఉన్నవారు రోజూ ఈ పీచుతో టీ కాచుకుని తాగితే చెక్కర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి.

బరువుకు... దీనిలో ఉండే పీచు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. జీవక్రియను పెంచుతుంది. శరీరంలో ఉండే చెడుకొవ్వులను బయటకు పంపంచి బరువు తగ్గడానికి సహాయ పడుతుంది. అదనపు కొవ్వును కరిగిస్తుంది కూడా..

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్