ఆ అసౌకర్యాలు.. వీటితో మాయం

పీరియడ్స్‌ మహిళల్లో ప్రతి నెలా జరిగే సాధారణ ప్రక్రియే. కానీ నొప్పి, అసౌకర్యాన్ని తట్టుకోవడమే ఇబ్బంది. ట్యాబ్లెట్లు వాడితే దీర్ఘకాలంలో సమస్యలు.

Updated : 01 Aug 2023 05:04 IST

పీరియడ్స్‌ మహిళల్లో ప్రతి నెలా జరిగే సాధారణ ప్రక్రియే. కానీ నొప్పి, అసౌకర్యాన్ని తట్టుకోవడమే ఇబ్బంది. ట్యాబ్లెట్లు వాడితే దీర్ఘకాలంలో సమస్యలు. వీటితో సహజంగా తగ్గించుకోవడానికి ప్రయత్నించండి..

పుచ్చకాయ: నెలసరి నొప్పిని తగ్గించడంలో పుచ్చకాయ బాగా సాయపడుతుంది. ఈ రోజుల్లో వచ్చే గ్యాస్‌, కడుపు మంట సమస్యని నియంత్రించడమే కాదు.. శరీరంలో వేడినీ తగ్గిస్తుంది. త్వరగా జీర్ణమవుతుంది కూడా.

బీట్‌రూట్‌:  పీరియడ్స్‌ సమయంలో శరీరం బాగా అలసిపోతుంది. రక్తస్రావం, నొప్పి వల్ల బలహీనంగానూ తయారవుతారు. కొందరిలో రక్తహీనత కూడా కనిపిస్తుంటుంది. కాబట్టి, ఈ సమయంలో బీట్‌రూట్‌ని ఆహారంలో తప్పనిసరిగా భాగం చేసుకోండి. ఇందులో ఉండే ఫోలిక్‌ యాసిడ్‌ ఐరన్‌ రక్తహీనతను దరి చేరనీయదు. ఇంకా దీనిలోని పోషకాలు ఒంటికి తక్షణ శక్తినీ అందిస్తాయి.

నిమ్మకాయ: పులుపుతో గ్యాస్‌ సమస్య అనుకుంటాం కానీ.. నెలసరి సమయంలో నిమ్మకాయ నీళ్లు చాలా మేలు చేస్తాయి. దీనిలోని విటమిన్‌ సి త్వరిత శక్తిని ఇవ్వడమే కాదు.. ఎర్ర రక్తకణాలు ఏర్పడటానికీ సాయపడుతుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఆ సమయంలో ఉండే తిమ్మిరి, చిరాకుల నుంచీ ఉపశమనం ఇస్తుంది.

అల్లం: కడుపు ఉబ్బరానికి అల్లం మంచి మందు. దీనిలోని జింజెరాల్‌ శరీరంలో వేడిని తగ్గిస్తుంది. హార్మోన్ల సమతుల్యతలో సాయపడి నొప్పినీ తగ్గిస్తుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్