కండిషనర్‌ పడట్లేదా?

కురులకు పోషణ అందాలి, మెత్తగా పట్టుకుచ్చులా ఉండాలని కండిషనర్‌ రాస్తుంటాం. తీరా అదే కొన్నిసార్లు పొడిబారేలా చేస్తుంది. ఇంకొన్నిసార్లు సమయానికి తెచ్చుకోవడం మర్చిపోయినా జుట్టు బరకగా మారుతుంది.

Published : 05 Jul 2024 02:06 IST

కురులకు పోషణ అందాలి, మెత్తగా పట్టుకుచ్చులా ఉండాలని కండిషనర్‌ రాస్తుంటాం. తీరా అదే కొన్నిసార్లు పొడిబారేలా చేస్తుంది. ఇంకొన్నిసార్లు సమయానికి తెచ్చుకోవడం మర్చిపోయినా జుట్టు బరకగా మారుతుంది. సమస్య ఏదైనా ఈ సహజ కండిషనర్ల సాయం తీసుకోండి.

  • పావు కప్పు తేనెకు చెంచా ఆలివ్‌ ఆయిల్‌ చేర్చి, బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని తలస్నానం పూర్తయ్యాక తడితలకు పట్టించి, పది నిమిషాలు వదిలేయాలి. ఆపై గోరువెచ్చని నీటితో తలస్నానం చేస్తే సరి. ఈ మిశ్రమం కురులను నిగనిగలాడేలా చేస్తుంది. 
  • రెండు గుడ్ల తెల్లసొనకు స్పూను తేనె, కొన్నిచుక్కల నిమ్మరసం కలిపి, తలకు పట్టించండి. పావుగంటయ్యాక గోరువెచ్చని నీటితో కడిగేస్తే సరి. జుట్టు పట్టుకుచ్చులా ఆరోగ్యంగా మెరవడం ఖాయం.
  • నాలుగు స్పూన్ల బేకింగ్‌ సోడా తీసుకోండి. తలస్నానం చేశాక మాడు నుంచి కురుల వరకు దీన్ని పట్టించి, అయిదు నిమిషాలు మృదువుగా మర్దనా చేయండి. అరగంటాగి గోరువెచ్చని నీళ్లతో స్నానం చేస్తే చాలు. ఇది చుండ్రు సహా ఎన్నో సమస్యలను దూరం చేస్తుంది. జుట్టు ఆరోగ్యంగా, దృఢంగా పెరిగేలా చేస్తుంది. 
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్