గాజుల రాజసం!

మహిళల బీరువాలో నగలెన్ని ఉన్నా.. గాజులపై ఉండే మోజు మాత్రం ప్రత్యేకం. పండుగలూ, వేడుకలు ఉన్నాయంటే చాలు... కట్టే పట్టుచీరల అందాన్ని ఇవి రెట్టింపు చేస్తాయంటారు మహిళలు.

Published : 02 Jul 2024 01:57 IST

మహిళల బీరువాలో నగలెన్ని ఉన్నా.. గాజులపై ఉండే మోజు మాత్రం ప్రత్యేకం. పండుగలూ, వేడుకలు ఉన్నాయంటే చాలు... కట్టే పట్టుచీరల అందాన్ని ఇవి రెట్టింపు చేస్తాయంటారు మహిళలు. అంతేనా, తమ అలంకరణ చేతికి గాజులు వేసుకోవడం అయ్యాకే పూర్తవుతుందని గొప్పగా చెబుతారు. వీటికి ఇంత ప్రాధాన్యం ఉండబట్టే ఎన్నెన్నో డిజైన్లు ఎప్పటికప్పుడు కొత్తందాలు చుట్టుకుని వచ్చేస్తుంటాయి. మరి ఇప్పుడేంటి అంటారా? ఈ రాయల్‌ ‘రాజ్వాదీ కడా’లే హాటెస్ట్‌ ట్రెండ్‌. రాజస్థానీ హస్తకళా నైపుణ్యాన్ని ఇందులో ఇమిడ్చి చేస్తారు. సంప్రదాయ విధానాలకు ఆధునిక సొబగులు అద్ది వీటిని రూపొందిస్తారు. నక్షీ చిత్రణ, అక్కడక్కడా మెరిసే రాళ్లూ,రత్నాలు, ముత్యాలు, పసిడి పూసలు... ఒక వైపు మాత్రమే వేలాడుతూ మరింత వైభవంగా కనిపించేలా చేస్తాయి. ఈ రాజ్వాదీ బ్యాంగిల్స్‌ని వేరే వాటితో కలిపి వేసుకున్నా, ఇవొక్కటే ధరించినా ధగధగలాడిపోవడం ఖాయం. వాటినోసారి మీరూ చూసేయండి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్