ప్యాంట్‌నీ పట్టించుకోండి!

నెక్‌ ఏది పెట్టించుకోవాలి? వెనక మెడకి డోరీ బాగుంటుందా... పాట్‌నెక్‌తో సరిపెడదామా? చేతులకేమో బెల్‌ స్లీవ్స్‌... ఒక టాప్‌ కుట్టించడానికి ఎంత ఆలోచిస్తాం! ప్యాంట్‌ విషయానికి వచ్చేసరికి నిర్ణయం మాత్రం టైలర్‌కే వదిలేస్తాం.

Published : 29 Jun 2024 01:39 IST

నెక్‌ ఏది పెట్టించుకోవాలి? వెనక మెడకి డోరీ బాగుంటుందా... పాట్‌నెక్‌తో సరిపెడదామా? చేతులకేమో బెల్‌ స్లీవ్స్‌... ఒక టాప్‌ కుట్టించడానికి ఎంత ఆలోచిస్తాం! ప్యాంట్‌ విషయానికి వచ్చేసరికి నిర్ణయం మాత్రం టైలర్‌కే వదిలేస్తాం. వాళ్లు ఏది బాగుందనుకుంటే మనమూ దానికే ఓటేస్తాం. సరిగా ఫిట్‌ అవదు, కుట్టించడం దండగ అనిపిస్తే లెగ్గింగ్‌ని జోడించేస్తాం. కానీ ప్యాంట్‌నీ ఓసారి పట్టించుకొని చూడండి. దుస్తులతోపాటు మీ అందం ఎంతగా పెరుగుతుందో మీకే అర్థమవుతుంది! అందుకు ఉదాహరణలే ఇవన్నీ. లేస్‌ ప్యాటర్న్, లిలాక్‌ నెట్, ఎంబ్రాయిడరీ, స్కాలోప్‌డ్, కశ్మీరీ క్రాస్‌డ్‌ స్టిచ్, లేయర్డ్‌ స్టిచ్‌... ప్రయత్నించాలే కానీ ఆకట్టుకునే సొగసులెన్నో! చేయాల్సిందల్లా కుర్తీ భారీతనాన్ని కొద్దిగా ప్యాంటుకీ అద్దడమే. సీక్వెన్స్, ముత్యాలు, రూబీలు, చమ్కీ అందాలను అక్కడక్కడా అద్దినా లుక్‌ ఇట్టే మారిపోతుంది. సాదా టాప్‌నీ స్టైలిష్‌గా మార్చేస్తుంది. కాబట్టి, పాత తరహా బాటమ్‌వేర్‌కి టాటా చెప్పేసి... ఈ ఆధునిక అందాలకు హలో చెప్పండి! ఈ ప్యాంట్‌ ఫ్యాషన్‌ ప్రయాణాన్ని ప్రారంభించడానికి మీరూ సిద్ధమేనా మరి?

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్