అమ్మాయిలు మెచ్చే ‘లోఫర్స్‌’

కాలానుగుణంగా రంగులూ, డిజైన్లలో ఎన్నో మార్పులు కనిపిస్తుంటాయి. వాటినే ట్రెండ్స్‌గా ఫాలో అయిపోతుంటాం. అయితే, కొన్ని ఫ్యాషన్లు మాత్రం తరాలెన్ని మారినా, శతాబ్దాలెన్ని గడుస్తున్నా ఎప్పటికీ ఎవర్‌గ్రీన్‌గానే ఉంటాయి. అలాంటివాటిల్లో లోఫర్స్‌ ఒకటి. వీటిని 1920ల్లోనే బ్రిటిష్‌ రాజైన కింగ్‌జార్జ్‌-6 కోసం ప్రత్యేకంగా రూపొందించారట.

Published : 28 Jun 2024 02:52 IST

కాలానుగుణంగా రంగులూ, డిజైన్లలో ఎన్నో మార్పులు కనిపిస్తుంటాయి. వాటినే ట్రెండ్స్‌గా ఫాలో అయిపోతుంటాం. అయితే, కొన్ని ఫ్యాషన్లు మాత్రం తరాలెన్ని మారినా, శతాబ్దాలెన్ని గడుస్తున్నా ఎప్పటికీ ఎవర్‌గ్రీన్‌గానే ఉంటాయి. అలాంటివాటిల్లో లోఫర్స్‌ ఒకటి. వీటిని 1920ల్లోనే బ్రిటిష్‌ రాజైన కింగ్‌జార్జ్‌-6 కోసం ప్రత్యేకంగా రూపొందించారట. ఈ పేరెందుకు వచ్చిందో సరైన ఆధారాలు లేనప్పటికీ సోమరిపోతులు ఎంచుకునే రకంగా ఇవి మొదట్లో ప్రాచుర్యం పొందాయి. లేసులు, బకెల్స్‌... వంటివి లేకుండా సులువుగా పాదాలు పట్టేయడమే ఇందుకు కారణమని చెబుతారు.. అయితే, తరవాతి కాలంలో ఈ లోఫర్స్‌ క్యాజువల్, ఫార్మల్‌ షూలకు ప్రత్యామ్నాయంగా మగవారు మెచ్చే ఫ్యాషన్‌గా మారాయి. 20వ శతాబ్దం ప్రారంభం నుంచి మహిళలూ వీటిని రోజువారీ వేసుకునే స్టైలిష్‌ ఫుట్‌వేర్‌గా ఎంచుకోవడం ఆరంభించారు. అప్పట్నుంచీ ఆడవారు మెచ్చే రంగులూ, డిజైన్లలో లోఫర్స్‌ రకాలెన్నో మార్కెట్‌లోకి వచ్చేశాయి. అది మొదలు యువత హాట్‌ ఫేవరిట్‌గా మారి మురిపిస్తున్నాయి. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్