జుట్టుకి ముల్తానీ మాస్క్‌..!

తక్కువ ఖర్చుతో తొందరగా తాజా మెరుపుని పొందాలంటే మనందరి మొదటి ఎంపిక ముల్తానీ మట్టే. దీన్ని ఎక్కువగా ముఖానికి మాస్క్‌ వేసుకునేందుకు వాడతారనే తెలుసు. కానీ ఇది జుట్టుకీ బోలెడన్ని ప్రయోజనాలు ఇస్తుందట.

Published : 25 Jun 2024 01:23 IST

తక్కువ ఖర్చుతో తొందరగా తాజా మెరుపుని పొందాలంటే మనందరి మొదటి ఎంపిక ముల్తానీ మట్టే. దీన్ని ఎక్కువగా ముఖానికి మాస్క్‌ వేసుకునేందుకు వాడతారనే తెలుసు. కానీ ఇది జుట్టుకీ బోలెడన్ని ప్రయోజనాలు ఇస్తుందట.

  • ముల్తానీ మట్టి జుట్టుకి ఉన్న మురికినీ, చుండ్రునీ వదిలిస్తుంది.. మాడుపై అదనంగా విడుదలయ్యే నూనెల్ని నియంత్రిస్తుంది. కండిషనర్‌లా పనిచేసి కురులను మృదువుగా, మెరిసేలా చేస్తుంది. ఇందుకు ముల్తానీ మట్టి, బియ్యప్పిండి సమాన భాగాలుగా తీసుకుని కప్పు పెరుగు, ఓ గుడ్డులోని తెల్లసొన కలిపి మెత్తని పేస్టులా చేయాలి. దీన్ని మాడు నుంచి చివర్లకు పట్టించాలి. అరగంటాగి గాఢత లేని షాంపూతో తలస్నానం చేస్తే సరి.
  • నాలుగుచెంచాల ముల్తానీ మట్టికి రెండుచెంచాల నిమ్మరసం, చెంచా పెరుగు చేర్చి పేస్ట్‌లా చేయాలి. దీన్ని కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించాలి. అరగంటాగి రసాయనాలు లేని షాంపూతో తలస్నానం చేస్తే సరి. కురులు నిగనిగలాడతాయి. ఇందులోని యాంటీబ్యాక్టీరియల్, యాంటీ మైక్రోబయాల్‌ లక్షణాలు చుండ్రుని తగ్గిస్తాయి.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్