నెక్లెస్‌... తీరు మారుతోంది!

దుస్తులూ, యాక్సెసరీల్లోనే కాదు... పసిడి నగల్లోనూ వైవిధ్యమైన ఫ్యాషన్లను కోరుకుంటోంది ఈతరం. అందుకే, ఇప్పుడు ఆభరణాలన్నీ ఆధునిక సొబగులద్దుకుని మరీ వారిని ఆకట్టుకుంటున్నాయి. అలాంటి వాటిల్లో ఎసెమిట్రికల్‌ స్టైల్‌ ఒకటి.

Published : 25 Jun 2024 01:22 IST

దుస్తులూ, యాక్సెసరీల్లోనే కాదు... పసిడి నగల్లోనూ వైవిధ్యమైన ఫ్యాషన్లను కోరుకుంటోంది ఈతరం. అందుకే, ఇప్పుడు ఆభరణాలన్నీ ఆధునిక సొబగులద్దుకుని మరీ వారిని ఆకట్టుకుంటున్నాయి. అలాంటి వాటిల్లో ఎసెమిట్రికల్‌ స్టైల్‌ ఒకటి. నిన్నమొన్నటివరకూ సాధారణంగా డ్రెస్‌ల్లో కనిపించిన ఈ డిజైన్‌ ఇప్పుడు జ్యూయెలరీకి నిండుదనం తెస్తోంది. పాశ్చాత్యశైలిని తలపిస్తూ సంప్రదాయ సౌందర్యాన్ని మరింత అందంగా ఇనుమడింపజేస్తోంది. ఎసిమెట్రికల్‌ ప్యాటర్న్‌ అంటే... నగ అంతా ఒకే తీరున ఉండకపోవడమే! రెండు డిజైన్లను ఒకే ఆభరణంలో కలగలిపో లేదంటే ఒక వైపున కాస్త పెద్దగా, మరోవైపున చిన్నగా ఉండేలా తీర్చిదిద్దడమో, ఇవేవీ కావంటే పెండెంట్‌ మధ్యకి కాకుండా కాస్త పక్కగా ఏర్పాటు చేయడమో! ఏది ఏమైనా ఈ తరహా నగలు... ధరించినవారికి కొత్తదనాన్ని తెచ్చిపెట్టడమే కాదు చూసేవాళ్లందరినీ అయస్కాంతంలా ఆకట్టుకుంటున్నాయి. వాటిని మీరూ ఓ సారి చూసేద్దురూ!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్