చేతికి అందాల అల్లిక!

శుభానికీ, సౌభాగ్యానికీ ప్రతీకగా మహిళలు గాజుల్ని వేసుకోవడం మనకి తెలిసిందే. మొదట సంప్రదాయమే అయినా... క్రమంగా ఆ గాజులు తమ సొగుసునీ ఉట్టిపడేలా చేయాలని కోరుకున్నారు.

Published : 19 Jun 2024 01:45 IST

శుభానికీ, సౌభాగ్యానికీ ప్రతీకగా మహిళలు గాజుల్ని వేసుకోవడం మనకి తెలిసిందే. మొదట సంప్రదాయమే అయినా... క్రమంగా ఆ గాజులు తమ సొగుసునీ ఉట్టిపడేలా చేయాలని కోరుకున్నారు. ఈ కాలక్రమంలో కొన్నాళ్లు మట్టిగాజులతో పాటు చేతికి కనీసం రెండైనా బంగారు గాజులు ఉండాలనుకునేవారు. తరవాత బెంగాలీ బ్యాంగిల్‌ని ఎంచుకున్నారు. ఆపై కడియాల్లాంటి బ్రేస్‌లెట్‌లూ, కనీ కనిపించకుండా ఉండే సన్నటి రకాలు సందడి చేశాయి. వీటిల్లో సాదావీ, చెక్కుళ్లు, పూలూ, రాళ్లూ... ఇలా రకరకాల డిజైన్లను చూసి ఉంటాం. ఇప్పుడు వాటిన్నింటినీ పక్కకి పెట్టి కాస్త డిజైన్‌ కనిపించేలా, ఒక్కటి వేసుకున్నా నిండుదనం తెచ్చేలా ఆధునిక రకాలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. మరి యువత మెచ్చిందే ఫ్యాషన్‌ కదా! వారికోసమే ఈ అల్లిక గాజుల్ని తీసుకొచ్చారు తయారీదారులు. జడలు, కొబ్బరాకులు అల్లినట్లుగా ఈ  ‘వీవింగ్‌’ ప్యాటర్న్‌ బ్యాంగిల్స్‌ని రూపొందిస్తున్నారు. వీటికి రాళ్లూ, పూసలు వంటి హంగులు చేర్చి ఆడంబరంగానూ తీసుకొచ్చేస్తున్నారు. భలే అందంగా ఉన్నాయి కదూ!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్