ప్రెగ్నెన్సీలో మలబద్ధకం తగ్గాలంటే..

నాకిప్పుడు ఏడో నెల. క్రమం తప్పకుండా పరీక్షలు చేయించుకుంటున్నాను. ఆహారం విషయంలో కూడా పలు జాగ్రత్తలు తీసుకుంటున్నాను. కానీ, నాకు మలబద్ధకం సమస్య ఎక్కువగా ఉంది.

Published : 16 Feb 2024 14:23 IST

నాకిప్పుడు ఏడో నెల. క్రమం తప్పకుండా పరీక్షలు చేయించుకుంటున్నాను. ఆహారం విషయంలో కూడా పలు జాగ్రత్తలు తీసుకుంటున్నాను. కానీ, నాకు మలబద్ధకం సమస్య ఎక్కువగా ఉంది. దీనివల్ల చాలా ఇబ్బంది పడుతున్నాను. నీళ్లు కూడా ఎక్కువగానే తాగుతున్నా. ఈ సమస్య నుంచి బయటపడాలంటే ఇంకా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. దయచేసి సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి

జ. గర్భధారణ సమయంలో మలబద్ధకం రావడం అనేది చాలామందిలో కనిపిస్తుంటుంది. సాధారణంగా గర్భధారణ సమయంలో హార్మోన్లలో చాలా మార్పులు చోటు చేసుకుంటాయి. ఇందులో భాగంగా ప్రొజెస్టిరాన్‌ హార్మోన్‌ ఎక్కువ మోతాదులో విడుదలవుతుంటుంది. దీనివల్ల పేగులు విశ్రాంతి తీసుకుంటాయి. ఫలితంగా వాటిలో కదలిక లేకపోవడం వల్ల మలబద్ధకం సమస్య వస్తుంటుంది. ఇదే కాకుండా ఏడు, ఎనిమిది నెలల సమయంలో బేబీ పొజిషన్‌ బట్టి కూడా మలబద్ధకం సమస్య వస్తుంటుంది.

మలబద్ధకం సమస్యకు నీళ్లు ఎక్కువగా తాగడం చక్కటి పరిష్కారం. మీరు ప్రస్తుతం నీళ్లు ఎక్కువగానే తాగుతున్నానని చెప్పారు. కాబట్టి, దీనికి తోడుగా పీచు ఎక్కువగా ఉండే పదార్థాలను ఆహారంలో భాగం చేసుకోవాలి. అలాగే డైట్‌లో పండ్లను కూడా భాగం చేసుకోవాలి. యోగా, వ్యాయామం చేయడం వల్ల కూడా మలబద్ధకం సమస్యను తగ్గించుకోవచ్చు. అయితే గర్భధారణ సమయంలో డాక్టర్‌ సలహా మేరకు తేలికపాటి వ్యాయామాలు చేయడం మంచిది. ఇవన్నీ సహజసిద్ధంగా మలబద్ధకం తగ్గించుకునే చిట్కాలు. అప్పటికీ మీ సమస్య తగ్గకపోతే గైనకాలజిస్ట్‌ను సంప్రదించడం మంచిది. ఈ రోజుల్లో ప్రెగ్నెన్సీకి ఎఫెక్ట్‌ లేకుండా ఉండే చాలా మందులు అందుబాటులో ఉన్నాయి. మీ లక్షణాలకు తగ్గట్టుగా వారు మందులు ఇచ్చే అవకాశం ఉంటుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్