- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
జుట్టు రాలుతోందా? ఈ చిట్కాలు మీకోసమే..!
జుట్టు విపరీతంగా రాలిపోవడం అనేది ఈ మధ్య చాలామంది అమ్మాయిలు ఎదుర్కొంటోన్న సమస్య. వయసుతో సంబంధం లేకుండా ఎంతోమందిని ఈ సమస్య వేధిస్తోంది. ఈ క్రమంలో- ఈ సమస్యను పరిష్కరించగలిగే కొన్ని చిట్కాల గురించి తెలుసుకుందాం రండి..
జుట్టు విపరీతంగా రాలిపోవడం అనేది ఈ మధ్య చాలామంది అమ్మాయిలు ఎదుర్కొంటోన్న సమస్య. వయసుతో సంబంధం లేకుండా ఎంతోమందిని ఈ సమస్య వేధిస్తోంది. ఈ క్రమంలో- ఈ సమస్యను పరిష్కరించగలిగే కొన్ని చిట్కాల గురించి తెలుసుకుందాం రండి..
ఈ మిశ్రమంతో..
కప్పు ఆముదం నూనెలో టీస్పూన్ రోజ్మేరీ నూనె వేసి బాగా కలపాలి. ఈ నూనెల మిశ్రమాన్ని ఒక గ్లాస్ జార్లో భద్రపరచుకోవాలి. రోజూ రాత్రి పడుకునే ముందు ఈ నూనెను కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి కాసేపు మర్దన చేసుకోవాలి. ఇలా తరచూ చేస్తున్నట్లయితే జుట్టు రాలిపోయే సమస్య తగ్గుముఖం పట్టడం కొన్ని రోజుల్లోనే గమనించచ్చు.. అంతేకాదు.. జుట్టు ఒత్తుగా పెరిగేందుకూ ఈ నూనె తోడ్పడుతుంది.
కొబ్బరి పాలతో సిల్కీగా!
గరుకుగా, గడ్డిలా మారిన జుట్టును రిపేర్ చేయడానికి కండిషనర్ చక్కగా ఉపయోగపడుతుంది. అయితే ఇందుకోసం బయట దొరికేవి కాకుండా మన వంటింట్లో ఉండే కొబ్బరి పాలను ఉపయోగిస్తే తక్షణ ఫలితం ఉంటుందంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో కొన్ని కొబ్బరి పాలలో కొద్దిగా ఆర్గాన్ ఆయిల్ వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి.. షవర్ క్యాప్ పెట్టుకోవాలి. మరుసటి రోజు ఉదయం షాంపూ చేసుకుంటే జుట్టు మృదువుగా, సిల్కీగా మారడం గమనించచ్చు.
ఇవి గుర్తుపెట్టుకోండి!
⚛ కొబ్బరి నూనెను కాస్త వేడి చేసి.. పడుకునే ముందు కుదుళ్లు, జుట్టుకు పట్టించాలి. కాసేపు కుదుళ్లను మర్దన చేసి షవర్ క్యాప్ పెట్టుకోవాలి. మరుసటి రోజు ఉదయం గాఢత తక్కువగా ఉండే షాంపూతో తలస్నానం చేయాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే ఫలితం ఉంటుంది.
⚛ జుట్టు వదిలేసుకొని నిద్ర పోతుంటారు కొంతమంది. తద్వారా కేశాలు గడ్డిలా, పిచ్చుక గూడులా మారతాయి. అందుకే జుట్టు ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే జడ వేసుకోవడం, పైకి ముడేసుకోవడం మంచిదంటున్నారు నిపుణులు. ఫలితంగా జుట్టు రాలే సమస్య కూడా అదుపులోకొస్తుంది. వీటితో పాటు తీసుకునే ఆహారంలో ‘ఎ’, ‘బి’, ‘సి’, ‘డి’, ‘ఇ’.. వంటి విటమిన్లు ఉండేలా చూసుకోవడమూ ముఖ్యమే!
గమనిక:
ఇక్కడ పేర్కొన్నవన్నీ సహజమైన పదార్ధాలే అయినా కొన్ని పదార్ధాలు కొందరికి పడకపోవచ్చు. అందువల్ల వీటిని వాడే విషయంలో ఏవైనా సందేహాలున్నట్లయితే మీరు వ్యక్తిగతంగా సంప్రదించే సంబంధిత నిపుణులను అడిగి తెలుసుకోవచ్చు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
బ్యూటీ & ఫ్యాషన్
- కంటి చుట్టూ మచ్చలు.. ఎలా పోతాయి?
- మొటిమలను తగ్గించే ఆహారం..!
- ఏఐ డ్రెస్... చూశారా?
- కండిషనర్ పడట్లేదా?
- కొరియన్ సాక్స్ షూ... అదిరెన్!
ఆరోగ్యమస్తు
- మధ్య రాత్రి మెలకువ వస్తోందా?
- పొట్ట తగ్గాలా... అలవాటు చేసుకోండి!
- గర్భాశయం అలా ఉంటే .. పిల్లలు పుడతారా?
- ఉన్నట్లుండి బరువు పెరిగినా, తగ్గినా.. జాగ్రత్త పడాల్సిందే!
- డ్రాగన్ పండు... పోషకాలు మెండు!
అనుబంధం
- Varalaxmi: అతడి అందమైన మనసు చూసి ఇష్టపడ్డా!
- పిల్లలకు ఈ నైపుణ్యాలున్నాయా..!
- తెలివితేటల్లో... ఇరుగూపొరుగూ!
- నా వల్లే పెళ్లి చేసుకోవట్లేదా..?
- Adoption: పిల్లల్ని దత్తత తీసుకున్నారా?
యూత్ కార్నర్
- టీ పాట్ కాదు.. హెయిర్‌స్టైల్!
- కోటలో రాణిగా కంటే.. ఈ వ్యాన్లోనే హ్యాపీగా ఉన్నా..!
- AI Dress: అమ్మాయిల వైపు కన్నెత్తి చూశారో.. ఇక అంతే!
- పరిమళాలు... రూ.కోట్లు వెదజల్లుతున్నాయి!
- ఫుట్‌బాల్ ఆటలో తొలి అనలిస్ట్‌గా... అంజిత!
'స్వీట్' హోం
- లైంగిక విషయాల గురించి తెలుసుకోవడం తప్పా..?
- వీటిని ఎన్ని రోజులకోసారి శుభ్రం చేస్తున్నారు?
- టీ తాగుతున్నా... బరువు పెరుగుతానా?
- నాన్‌స్టిక్ పాత్రలు వాడుతున్నారా?
- నిమ్మ... కుండీలోనూ పెరుగుతుందమ్మ!
వర్క్ & లైఫ్
- Deepika: ప్రయోజనాలెన్నో.. అందుకే రోజూ ఈ ఆసనం వేస్తున్నా!
- నైపుణ్యాలు పెంచుకుంటున్నారా..?
- Alia Bhatt: నా బిడ్డ కోసం రోజూ ఇలా చేస్తున్నా.. మరి మీరు?!
- ఉద్యోగమే జీవితమైపోయింది.. తోలుబొమ్మలా అలసిపోతున్నా!
- గృహిణిగా ఉండమంటే.. భర్త కంపెనీలో వాటా అడిగింది!