నిమ్మ... కుండీలోనూ పెరుగుతుందమ్మ!

నిగనిగలాడే పచ్చటి ఆకులు, చక్కటి సువాసనతో విచ్చుకునే పువ్వులు... నిండుగా కాసే పండ్లు... నిమ్మ మొక్క సొంతం. అయ్యో మాకు పెద్ద పెరడులేదే నాటుకోవడానికి అనుకోనక్కర్లేదు. కుండీల్లో పెరిగే డ్వార్ఫ్‌ నిమ్మ రకాలెన్నో వచ్చేశాయి.

Published : 04 Jul 2024 03:07 IST

నిగనిగలాడే పచ్చటి ఆకులు, చక్కటి సువాసనతో విచ్చుకునే పువ్వులు... నిండుగా కాసే పండ్లు... నిమ్మ మొక్క సొంతం. అయ్యో మాకు పెద్ద పెరడులేదే నాటుకోవడానికి అనుకోనక్కర్లేదు. కుండీల్లో పెరిగే డ్వార్ఫ్‌ నిమ్మ రకాలెన్నో వచ్చేశాయి.

కూరలు, పచ్చళ్లు, జ్యూస్‌... ఇలా వేర్వేరు అవసరాలకోసం నిమ్మను మనం విరివిగా వాడేస్తుంటాం. నిమ్మ శాస్త్రీయ నామం సిట్రస్‌ లిమోన్‌. ప్రాంతాన్ని బట్టి దీనికి ఎన్నో పేర్లూ ఉన్నాయి. మేయర్‌ ఇంప్రూవ్డ్, లిస్బన్, పొండెరోసా, యురేకా... వంటి డ్వార్ఫ్‌ వెరైటీలు కంటైనర్లలో బాగా పెరుగుతాయి.

ఎలా పెంచాలి: సాధారణంగా నిమ్మ మొక్క కాపు రావడానికి కనీసం ఐదేళ్ల సమయం పడుతుంది. బదులుగా మూడేళ్ల వయసున్న ఆరోగ్యకరమైన మొక్కను నర్సరీ నుంచి తెచ్చుకుని నాటుకుంటే త్వరగా కాపు వస్తుంది. నిమ్మ మొక్క పెంపకానికి పెద్ద కంటైనర్‌ అవసరం. దాని అడుగున పళ్లెం పెట్టి పెబల్స్‌ వేస్తే మొక్క చుట్టూ తేమ నిలకడగా ఉంటుంది. కుండీల్లో నింపే మట్టిలో కాస్త ఇసుక, కంపోస్ట్‌ కలపాలి. కనీసం ఎనిమిది గంటల ఎండతగిలేలా చూసుకోవాలి. రోజూ తప్పక నీళ్లు పోయాలి. ఈ కంటైనర్‌ని గాలి ధారాళంగా వచ్చే టెర్రస్, బాల్కనీల్లో ఉంచితే మేలు. 15 రోజులకోసారి ఎన్‌పీకే ఎరువుని 12-6-6 నిష్పత్తిలో వేస్తే ఆరోగ్యంగా ఎదుగుతుంది. పూలు వచ్చేటప్పుడు పొటాషియం ఎక్కువగా నైట్రోజన్‌ తక్కువగా అందించాలి. లేదంటే పూత తగ్గిపోతుంది. మృదువైన బ్రష్‌తో పూలపై రుద్దితే పాలినేషన్‌ జరిగి ఎక్కువ పూలు, పండ్లూ వస్తాయి. ఎండిన, జబ్బు పడిన కొమ్మల్ని ఎప్పటికప్పుడు తీసేయాలి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్