వార్తాపత్రిక చదువుతున్నారా..!

అమ్మాయిలూ... మీలో న్యూస్‌పేపర్‌ చదివే అలవాటు ఎంతమందికి ఉంది? ఆ... అంత తీరిక మాకెక్కడిదీ? ఫోనే అంతా అంటారా! కానీ, పేపర్‌ చదవడం వల్ల ఎన్ని లాభాలున్నాయో తెలుసా? ఉదయాన్నే చల్లగాలికి వేడివేడి టీ లేదా కాఫీ తాగుతూ కుర్చీలో కూర్చొని, పేపర్‌ చదువుతోంటే ఆ ఫీలింగే వేరుకదా!

Published : 22 Jun 2024 05:03 IST

అమ్మాయిలూ... మీలో న్యూస్‌పేపర్‌ చదివే అలవాటు ఎంతమందికి ఉంది? ఆ... అంత తీరిక మాకెక్కడిదీ? ఫోనే అంతా అంటారా! కానీ, పేపర్‌ చదవడం వల్ల ఎన్ని లాభాలున్నాయో తెలుసా? ఉదయాన్నే చల్లగాలికి వేడివేడి టీ లేదా కాఫీ తాగుతూ కుర్చీలో కూర్చొని, పేపర్‌ చదువుతోంటే ఆ ఫీలింగే వేరుకదా! ఒక్కో పేజీ తెరుస్తూ ఆ బ్రాడ్‌షీట్‌ లేఅవుట్, అందులో ఉండే ఫొటోలూ, పదాలూ, హెడ్‌లైన్లూ చూస్తూ ఉంటే ఆ అనుభూతి వేరు. తరవాతి పేజీలో ఏముంటుందో అనే సస్పెన్స్‌... మనలో మరింత ఉత్సాహాన్ని పెంచుతుంది. ఉదయాన్నే మనం పేపర్‌ చదువుతున్నప్పుడు దాన్నుంచి వచ్చే చప్పుడు పక్షి రెక్కలతో చేసే శబ్దంలానూ అనిపిస్తుంటుంది. ఒకరకంగా చెప్పాలంటే ప్రశాంతంగా కూర్చుని సమాచారాన్నీ, విజ్ఞానాన్నీ తెలుసుకునే ప్రక్రియే ఈ పేపర్‌ రీడింగ్‌. ఈ భావనలన్నీ మామూలుగా మొబైల్‌లో న్యూస్‌ను స్క్రోల్‌ చేసుకుంటూ వెళ్తే రావు కదా! ప్రతిపేజీలో వ్యక్తుల విజయగాథలూ, స్థానికంగా జరిగే కార్యక్రమాల నుంచి జాతీయ, అంతర్జాతీయ వార్తలూ, క్రీడావిజయాలూ... ఇలా ఎన్నో రకాల అంశాల కలబోతే పత్రిక. పైగా దీనికి నో ఛార్జింగ్‌..నో బఫరింగ్‌.. అన్నమాట. కేవలం మనం మనముందున్న సమాచారాన్ని హాయిగా, అలా చదువుకుంటూ వెళ్లడమే! ఇదొక రకమైన విలాసం మరి... ఆలోచించండి!

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్