- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
పొలం అమ్మి... రాజధానికి ఇచ్చా
ఆమె ఓ వైద్య విద్యార్థిని... రెక్కలు విప్పుకొన్న పక్షిలా ఎగిరిపోవాలని కలలు కనే వయసు తనది. తన ఈడువాళ్లంతా సరదాలు, సంతోషాల కోసం డబ్బులు ఖర్చుపెడుతుంటే... ఈ అమ్మాయి మాత్రం దాచుకున్న డబ్బుల్నీ, భవిష్యత్తు కోసమని ఉంచిన ఆస్తుల్నీ... ప్రజా సేవ కోసం వినియోగిస్తోంది. తాజాగా ఆంధ్రుల కలల రాజధాని అమరావతి నిర్మాణానికి రూ.25లక్షలు, పోలవరం ప్రాజెక్టుకోసం రూ.లక్ష విరాళం అందించి అందరితోనూ ఔరా అనిపించుకుంటోన్న అంబుల వైష్ణవి స్ఫూర్తి ప్రయాణమిది...
ఆమె ఓ వైద్య విద్యార్థిని... రెక్కలు విప్పుకొన్న పక్షిలా ఎగిరిపోవాలని కలలు కనే వయసు తనది. తన ఈడువాళ్లంతా సరదాలు, సంతోషాల కోసం డబ్బులు ఖర్చుపెడుతుంటే... ఈ అమ్మాయి మాత్రం దాచుకున్న డబ్బుల్నీ, భవిష్యత్తు కోసమని ఉంచిన ఆస్తుల్నీ... ప్రజా సేవ కోసం వినియోగిస్తోంది. తాజాగా ఆంధ్రుల కలల రాజధాని అమరావతి నిర్మాణానికి రూ.25లక్షలు, పోలవరం ప్రాజెక్టుకోసం రూ.లక్ష విరాళం అందించి అందరితోనూ ఔరా అనిపించుకుంటోన్న అంబుల వైష్ణవి స్ఫూర్తి ప్రయాణమిది...
మాది ఏలూరు జిల్లా ముదినేపల్లి. నాకు రెండున్నరేళ్లున్నప్పుడు అమ్మానాన్నలు విడాకులు తీసుకున్నారు. నాన్న వైద్యుడిగా ఎంత బిజీగా ఉన్నా... నాకే లోటూ రాకుండా చూసుకునేవారు. మరో పక్క అర్ధరాత్రి వరకూ కూడా వైద్యం కోసం వచ్చేవారికి అందుబాటులో ఉండేవారు. అది చూసి ఎప్పుడైనా.. ‘నాన్నా ఎందుకింత శ్రమ’ అని అడిగితే... కష్టంలో ఉన్నప్పుడు స్పందిస్తేనే మనలో మానవత్వం మిగిలి ఉన్నట్లు అని చెప్పేవారు. అలా ఆయన నుంచి అందుకున్న స్ఫూర్తితోనే చిన్నప్పటి నుంచీ సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకునేదాన్ని. ఏడో తరగతి చదువుతున్న సమయంలో నాన్న ఇచ్చిన పాకెట్‌మనీతో మొదటిసారి రంగాపురం, ముదినేపల్లి పాఠశాలలు, ప్రభుత్వ జూనియర్ కాలేజీలని దత్తత తీసుకున్నా. డిజిటల్ క్లాస్రూమ్, ఫర్నిచర్, ఆటవస్తువులు, బోర్లు, నీటి ట్యాంకు వంటివి ఏర్పాటు చేశా. ఆపై ‘ఈనాడు’ ఆధ్వర్యంలో నిర్వహించిన సుజలాం..సుఫలాం.., వనం..మనం కార్యక్రమాల్లో భాగంగా ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలల్లో ఇంకుడు గుంతలు తవ్వడం, మొక్కలు నాటడం వంటివే కాదు, క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక అనారోగ్యాలతో బాధపడుతున్నవారి చికిత్సకు అవసరమైన ఆర్థిక భరోసానీ నాన్న సాయంతో చేయగలిగా. నిరుపేదల అంత్యక్రియలకు డబ్బులు ఇవ్వడమే కాదు... కొందరికి నాన్నతో తలకొరివీ పెట్టించి, నేను కర్మకాండల్ని చేశా.
కొవిడ్ బాధితులకు చేయూత...
చాలామంది ఈ చిన్న వయసులో ఇవన్నీ నీకెందుకమ్మా అంటుంటారు. సాయం చేయాలనే మనసుండాలి కానీ, సేవ చేయడానికి వయసుతో సంబంధం ఏముంది? నా వంతు చేయగలిగినవే చేస్తున్నా. నేను చేయాలనుకున్న వాటికి నాన్న తోడుంటున్నారు. ఆ మధ్య కొవిడ్ రూపంలో మనందరికీ ఊహించని కష్టం వచ్చిపడింది. ఆ సమయంలో పనులు లేక ఇబ్బందిపడుతోన్న సుమారు 400 మందికి ఆర్థిక సాయంతో పాటు నిత్యావసర సరకులను అందించాం. అప్పుడు వారి కళ్లల్లో సంతోషం చూసి మాగుండె ఉప్పొంగిపోయింది.
నూతనంగా రాష్ట్రం ఏర్పడ్డాక... రాష్ట్ర అభివృద్ధికోసం కడప ఉక్కు పరిశ్రమ నిర్మాణం, అమరావతి స్థూపం, హైకోర్టు, పోలవరం నిర్మాణాలకు రూ.లక్ష చొప్పున అందించా. ఇది తెలిసి అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు 2018 జనవరిలో అమరావతి బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించారు. అప్పుడే రాష్ట్ర భవిష్యత్తుకోసం నాపేరున ఉన్న మూడెకరాల్లో ఒకదాన్ని అమ్మగా వచ్చిన మొత్తం ఇస్తానన్నా. ఇప్పుడు కూటమి అధికారంలోకి రావడంతో ఆ రూ.25లక్షలను, పోలవరం ప్రాజెక్టుకోసం నా బంగారం అమ్మగా వచ్చిన రూ.లక్ష రూపాయల్ని తాజాగా ముఖ్యమంత్రికి అందించా. ఆయన మరోసారి అమరావతి అంబాసిడర్‌గా నన్ను ప్రకటించారు. దీన్ని బాధ్యతగా తీసుకుని భవిష్యత్తులో సామాజిక ప్రయోజనం ఉన్న పనులు మరిన్ని చేస్తా. ప్రస్తుతం నేను ఎంబీబీఎస్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నా.
ధన వెంకటకృష్ణ, ముదినేపల్లి
ఆహ్వానం
మీరైతే ఏం చేస్తారు?
పిల్లలవ్వనీయండి... పెద్దవాళ్లవ్వనీయండి... కొన్ని అలవాట్లు చేయడానికీ... మరికొన్నింటిని మాన్పించడానికీ ఎంత కష్టపడతామో కదా? కొందరు మాత్రం చిన్న ఉపాయాలతోనే భలేగా ఫలితం సాధించేస్తారు. మీరూ వాళ్లలో ఒకరా? అయితే దీనికి సమాధానం చెప్పగలరేమో చూడండి.
‘స్నానం చేశాక తడి తువాలుని బెడ్ మీద వేయొద్దు’ అని ఎంత చెప్పినా కొన్ని ఇళ్లల్లో అలవాటు మానరు. దీన్ని మీరు మాన్పించారా? అయితే ఎలాగో మాతో పంచుకోండి. పేపరులో పేరుతో సహా ప్రచురిస్తాం. vasundhara@eenadu.in కి సమాధానం పంపేయండి మరి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
బ్యూటీ & ఫ్యాషన్
- ప్యాంట్నీ పట్టించుకోండి!
- మన మహిళా ఎంపీల.. ‘పార్లమెంట్ ఫ్యాషన్’ స్టైల్!
- జుట్టు ఆరోగ్యానికి అవిసె గింజలు..!
- అమ్మాయిలు మెచ్చే ‘లోఫర్స్’
- ముఖంపై జిడ్డుదనం తగ్గాలంటే..
ఆరోగ్యమస్తు
- మీ పిల్లలు ఎత్తు పెరగడం లేదా? ఇలా చేయండి..!
- హాకినితో... చురుగ్గా!
- హార్మోన్లు సమతులంగా.. ఉండాలంటే..!
- పోనీ ఇలా తాగండి!
- ప్రసవ సమయంలో... తినొచ్చా?
అనుబంధం
- ఆ అమ్మలకీ సెలవిస్తారు!
- ప్రతి విషయాన్నీ తన తల్లికి చెబుతున్నాడు..!
- ఆలయం థీమ్‌తో ఆహ్వానం..!
- Rama Rajamouli: అందుకే మా అనుబంధం దృఢంగా ఉంది..!
- బ్రేకప్ చెబుతున్నారా?
యూత్ కార్నర్
- మా అమ్మ ‘ఐశ్వర్యారాయ్’లా.. అందంగా ఉంటే..!
- ...వాళ్లని ఓడిపోనివ్వదు!
- అనాథలకు అర్హత కల్పించింది..!
- Radhika-Anant: అంబానీ వారి పెళ్లి శుభలేఖ.. అదుర్స్!
- సాగు పరికరాలు... బతుకునిచ్చాయి!
'స్వీట్' హోం
- వెండి ఆభరణాలు భద్రంగా ఉండాలంటే..!
- మా వాళ్లు టవల్ ఆరేయకపోతే ఇలా చేస్తాం..!
- ఆ గుర్తుల గుట్టు ఇదే..!
- అమ్మ మీద అరిచేస్తున్నా!
- పూజా సామగ్రితో సంస్కారా హోమ్!
వర్క్ & లైఫ్
- గృహిణిగా ఉండమంటే.. భర్త కంపెనీలో వాటా అడిగింది!
- Renu Desai: మీకు కుటుంబాల్లేవా? ఇకనైనా వీటిని ఆపండి!
- చదువా... పిల్లలా?
- ఆరు తరాలు.. 185 మంది.. ఒకే ఇంట్లో..!
- ఆ దేశంలో పిల్లలకు నాలుగంచెల లంచ్ బాక్స్!