జ్యూట్‌తో ‘జురూ’

పూజ బాకర్‌... జురూ యోగా మ్యాట్స్‌ కో-ఫౌండర్‌. ఈమెది చెన్నై. యూకేలో ఇంటర్నేషనల్‌ బిజినెస్‌కోర్సు పూర్తయ్యాక యూఎస్‌ వెళ్లి ఎంబీఏ చేయాలనుకుంది పూజ. కానీ, దురదృష్టవశాత్తూ వాళ్ల నాన్నకు యాక్సిడెంట్‌ అవడంతో కుటుంబ బాధ్యతలు తీసుకోవాల్సి వచ్చింది. అందులో భాగంగా కుటుంబ వ్యాపారమైన పబ్లిషింగ్‌ నిర్వహణ చూసుకోవడంతో పాటు, భర్తతో కలిసి ఐటీ సొల్యూషన్స్‌నూ ప్రారంభించింది.

Updated : 21 Jun 2024 05:04 IST

పూజ బాకర్‌... జురూ యోగా మ్యాట్స్‌ కో-ఫౌండర్‌. ఈమెది చెన్నై. యూకేలో ఇంటర్నేషనల్‌ బిజినెస్‌కోర్సు పూర్తయ్యాక యూఎస్‌ వెళ్లి ఎంబీఏ చేయాలనుకుంది పూజ. కానీ, దురదృష్టవశాత్తూ వాళ్ల నాన్నకు యాక్సిడెంట్‌ అవడంతో కుటుంబ బాధ్యతలు తీసుకోవాల్సి వచ్చింది. అందులో భాగంగా కుటుంబ వ్యాపారమైన పబ్లిషింగ్‌ నిర్వహణ చూసుకోవడంతో పాటు, భర్తతో కలిసి ఐటీ సొల్యూషన్స్‌నూ ప్రారంభించింది. ఈ సమయంలోనే యోగా కోర్సు నేర్చుకుని, సర్టిఫైడ్‌ ట్రైనర్‌ కూడా అయ్యింది. అయితే, శిక్షణ సమయంలో తను వాడే యోగా మ్యాట్‌లు చాలా అసౌకర్యంగా అనిపించేవట. దాంతో వీటిని సహజంగానూ, జారకుండానూ తయారుచేస్తే బాగుంటుందన్న ఆలోచన వచ్చింది. అందుకోసం మ్యాట్‌ తయారీపై కొంత పరిశోధన చేసింది.

మనం ఉపయోగించే యోగా మ్యాట్‌లు పాలీ వినైల్‌ క్లోరైడ్‌(పీవీసీ) మెటీరియల్‌తో తయారుచేస్తారనీ, పైగా అవి పర్యావరణానికీ హాని అని తెలుసుకుంది. స్థానిక తయారీదారులతో మాట్లాడి, మాన్యుఫాక్చరింగ్‌కు సంబంధించి అనేక విషయాలు నేర్చుకుంది. జ్యూట్, సహజ రబ్బర్లతో కలిపి శాంపిల్‌ ఉత్పత్తినీ తయారుచేసింది. ఆ రెండు పేర్లూ (జ్యూట్‌ అండ్‌ రబ్బర్‌) కలిసేలా ‘జురూ’ అని తన స్టార్టప్‌నకు పేరు పెట్టింది. వినియోగదారుల ఫీడ్‌బ్యాక్‌తోపాటు, తన పరిశోధనలతో ఆ ఉత్పత్తుల్లో ఎన్నో మార్పులు చేసుకుంటూ వచ్చింది. అలా క్రమంగా యోగా కార్డ్‌ కేస్‌లూ, బెల్టులూ, మోకాలికి కుషన్లూ, దుప్పట్లూ, కార్క్‌ బ్లాక్స్, బ్యాగుల్లాంటి యాక్సెసరీలెన్నో తయారుచేసి ఆన్‌లైన్లో అందుబాటులో ఉంచింది. కోట్లలో సంపాదిస్తూ వ్యాపారాన్ని విజయపథంలో నడిపిస్తోంది.  

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్