Warangal: ఐటీలో ఓరుగల్లుకు పెద్దపీట

ఐటీ రంగంలో ఓరుగల్లుకు పెద్దపీట వేసి అభివృద్ధి చేస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు పేర్కొన్నారు.

Published : 05 Jul 2024 03:38 IST

మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు

ఐటీ కంపెనీని ప్రారంభిస్తున్న మంత్రి శ్రీధర్‌బాబు. చిత్రంలో రాక్‌ ఐటీ కంపెనీ వ్యవస్థాపకుడు రావుల రంజిత్‌రెడ్డి, వరంగల్‌ పశ్చిమ ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి 

ఎన్జీవోకాలనీ, న్యూస్‌టుడే: ఐటీ రంగంలో ఓరుగల్లుకు పెద్దపీట వేసి అభివృద్ధి చేస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. హనుమకొండలోని ఇందిరానగర్‌లో రావుల రంజిత్‌రెడ్డి ఏర్పాటు చేసిన రాక్‌ ఐటీ కంపెనీని గురువారం మంత్రి వరంగల్‌ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. విదేశాల్లో స్థిరపడిన భారతీయులు తాము పుట్టిన గడ్డపై వ్యాపార సంస్థలు ఏర్పాటు చేయాలని కోరారు. రంజిత్‌రెడ్డి ఏర్పాటు చేసిన ఐటీ కంపెనీతో స్థానిక యువతకు ఉద్యోగావకాశాలు లభిస్తాయన్నారు. అభివృద్ధి చెందుతున్న పట్టణాలు, నగరాల్లో కంపెనీలు ఏర్పాటు చేస్తే రాష్ట్రం ఐటీ రంగంలో ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందుతుందని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో ఓరుగల్లులో మరిన్ని పరిశ్రమల ఏర్పాటుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని