బొగతలో జల సవ్వడి

తెలంగాణ నయాగరాగా పిలిచే ములుగు జిల్లా వాజేడు మండలంలోని బొగత జలపాతం అందాలు పర్యాటకులకు కనువిందు చేస్తున్నాయి.

Published : 02 Jul 2024 06:07 IST

తెలంగాణ నయాగరాగా పిలిచే ములుగు జిల్లా వాజేడు మండలంలోని బొగత జలపాతం అందాలు పర్యాటకులకు కనువిందు చేస్తున్నాయి. ఛత్తీస్‌గఢ్‌ అడవుల్లో ఆదివారం రాత్రి కురిసిన వర్షంతో చీకుపల్లి వాగు ఉద్ధృతంగా ఉప్పొంగుతోంది. దీంతో పెద్దఎత్తున వరద నీరు జలపాతంలోకి చేరుతోంది. ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న నీటి తుంపర్లలో పర్యాటకులు తడిసిముద్దవుతున్నారు. వరదనీటి ప్రవాహానికి తోడు జలపాతం హోరు దట్టమైన అటవీప్రాంతంలో ప్రతిధ్వనిస్తోంది. సోమవారం వరంగల్, హైదరాబాద్‌ నుంచి పెద్దసంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. 

న్యూస్‌టుడే, వాజేడు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని