Telangana news: తుక్కు దుకాణానికి పాఠ్యపుస్తకాలు.. పోలీసులకు సమాచారమిచ్చిన తల్లిదండ్రులు

ప్రభుత్వ గిరిజన ఆశ్రమ పాఠశాల విద్యార్థులకు అందాల్సిన పాఠ్యపుస్తకాలు స్క్రాప్‌ దుకాణానికి చేరిన ఉదంతమిది.

Updated : 27 Jun 2024 08:47 IST

న్యూస్‌టుడే, అచ్చంపేట న్యూటౌన్‌: ప్రభుత్వ గిరిజన ఆశ్రమ పాఠశాల విద్యార్థులకు అందాల్సిన పాఠ్యపుస్తకాలు స్క్రాప్‌ దుకాణానికి చేరిన ఉదంతమిది. బుధవారం సాయంత్రం నాగర్‌కర్నూల్‌ జిల్లా అచ్చంపేట పట్టణంలోని ఉట్ల కోనేరు సమీపంలోని ఓ స్క్రాప్‌ దుకాణంలో గత విద్యాసంవత్సరానికి సంబంధించిన 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఆంగ్ల మాధ్యమ పుస్తకాలు సీలు కూడా తీయకుండా ఉండటం గమనించిన కొందరు తల్లిదండ్రులు పోలీసులకు సమాచారమిచ్చారు. 45 కట్టల పుస్తకాలను పోలీసులు ఠాణాకు తరలించారు. జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి(డీటీడీవో) కార్యాలయ ఉద్యోగి శంకర్‌ వాటిని విక్రయించినట్లు దుకాణం నిర్వాహకుడు తెలిపారు. డీటీడీవో కమలాకర్‌రెడ్డిని వివరణ కోరగా పుస్తకాల పక్కదారిపై పూర్తిస్థాయి విచారణ చేసి.. జిల్లా కలెక్టర్‌కు నివేదిక ఇస్తానని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని