stamps-Registration department: రిజిస్ట్రేషన్ల శాఖ రాబడి లక్ష్యం రూ.18,500 కోట్లు

ఖజానాకు కీలక ఆదాయాన్ని ఆర్జించి పెట్టే స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖకు ప్రభుత్వం రూ.18,500 కోట్ల రాబడిని లక్ష్యంగా నిర్దేశించింది.

Updated : 01 Jul 2024 05:45 IST

గతేడాది చేకూరింది రూ.14,588 కోట్లు

ఈనాడు, హైదరాబాద్‌: ఖజానాకు కీలక ఆదాయాన్ని ఆర్జించి పెట్టే స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖకు ప్రభుత్వం రూ.18,500 కోట్ల రాబడిని లక్ష్యంగా నిర్దేశించింది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి వ్యవసాయ, వ్యవసాయేతర రిజిస్ట్రేషన్ల ద్వారా ఈ మొత్తాన్ని సమకూర్చుకునేందుకు శాఖ కార్యాచరణ చేపట్టింది. గత ఆర్థిక సంవత్సరంలో శాఖ ద్వారా ఖజానాకు రూ.14,588 కోట్లు సమకూరాయి. ఇంతకన్నా అధిక రాబడి సమకూరుతుందని ప్రభుత్వం అంచనా వేసినా సాధ్యపడలేదు. గత ఆర్థిక సంవత్సరంలో జరిగిన ఎన్నికలు లావాదేవీలపై ప్రభావం చూపాయని అధికారులు భావిస్తున్నారు. దీంతో ఈ ఆర్థిక సంవత్సరంలో రాబడిని పెంచుకునేందుకు స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ దృష్టి సారించింది. 

ఆగస్టు 1 నుంచి కొత్త ధరలు!

రాష్ట్రంలో భూముల మార్కెట్‌ విలువ పెంచి నాలుగేళ్లు దాటుతోంది. బహిరంగ మార్కెట్‌లో భూముల ధరలకు, మార్కెట్‌ విలువలకు కొన్ని ప్రాంతాల్లో భారీ అంతరం ఉండటంతో తాజాగా వాటి విలువ పెంచేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఆగస్టు 1వ తేదీ నుంచి కొత్త ధరలను అమల్లోకి తేవాలని స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ భావిస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్‌ నుంచి జూన్‌ 27వ తేదీ వరకు రూ.3322.01 కోట్ల రాబడి వచ్చింది. అయితే, మార్కెట్‌ విలువ సవరణ అనంతరం ఈ ఏడాది రాబడి భారీగానే వచ్చే అవకాశాలున్నాయని రిజిస్ట్రేషన్ల వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు