TG News: ప్రభుత్వ న్యాయవాదుల తొలగింపుపై నోటీసులు

గత ప్రభుత్వ హయాంలో నియమితులైన ప్రభుత్వ న్యాయవాదులు, సహాయ న్యాయవాదులు, ప్రత్యేక న్యాయవాదులను సర్వీసుల నుంచి తొలగించడంపై ప్రభుత్వానికి మంగళవారం హైకోర్టు నోటీసులు జారీచేసింది.

Published : 03 Jul 2024 02:25 IST

ఈనాడు, హైదరాబాద్‌: గత ప్రభుత్వ హయాంలో నియమితులైన ప్రభుత్వ న్యాయవాదులు, సహాయ న్యాయవాదులు, ప్రత్యేక న్యాయవాదులను సర్వీసుల నుంచి తొలగించడంపై ప్రభుత్వానికి మంగళవారం హైకోర్టు నోటీసులు జారీచేసింది. దీనికి సంబంధించి గత నెల 26న ప్రభుత్వం జారీచేసిన జీవో 354ను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై జస్టిస్‌ పుల్లా కార్తీక్‌ మంగళవారం విచారణ చేపట్టారు. పిటిషనర్‌ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. నిర్దిష్ట కాలపరిమితితో ఈ నియామకాలు జరిగాయన్నారు. పదవీ కాలం పూర్తికాకముందే సర్వీసు నుంచి తొలగించడం సరికాదన్నారు. జీవో 354 అమలును నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. వాదనలు విన్న న్యాయమూర్తి జీవో అమలును నిలిపివేయడానికి నిరాకరిస్తూ.. ప్రభుత్వ వివరణ కోరుతూ నోటీసులు జారీచేశారు. వివరాలు సమర్పించాలని ఆదేశిస్తూ విచారణను 8వ తేదీకి వాయిదా వేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు