Sridharbabu: కోడింగ్‌కు కేంద్రంగా హైదరాబాద్‌

కోడింగ్‌లో హైదరాబాద్‌ ప్రపంచ కేంద్రంగా నిలుస్తోందని ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. హైదరాబాద్‌ రాయదుర్గం టీహబ్‌లో ఆదివారం ఎండ్‌ నౌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో సోషల్‌వుడ్‌ 2024 సమిట్‌ (ద్వి వార్షిక సదస్సు) నిర్వహించారు.

Published : 01 Jul 2024 07:24 IST

సోషల్‌వుడ్‌ 2024 సమిట్‌లో ఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌బాబు

సదస్సులో మాట్లాడుతున్న మంత్రి శ్రీధర్‌బాబు. చిత్రంలో డా.విజయభాస్కర్, అనిల్‌ రాచమల్ల, సుమ, దిల్‌ రాజు

రాయదుర్గం, న్యూస్‌టుడే: కోడింగ్‌లో హైదరాబాద్‌ ప్రపంచ కేంద్రంగా నిలుస్తోందని ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. హైదరాబాద్‌ రాయదుర్గం టీహబ్‌లో ఆదివారం ఎండ్‌ నౌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో సోషల్‌వుడ్‌ 2024 సమిట్‌ (ద్వి వార్షిక సదస్సు) నిర్వహించారు. ముఖ్యఅతిథిగా మంత్రి హాజరై ప్రసంగించారు. ‘‘రెండు లక్షల మంది నిపుణులైన ఇంజినీర్లు నగరం నుంచి అమెరికా సహా పలు దేశాలకు చెందిన పెద్ద పెద్ద కంపెనీలకు కోడింగ్‌ చేస్తున్నారు. ఇక్కడి మేధాసంపత్తి వల్లే అది సాధ్యమవుతోంది.. ఏఐ ఆధారిత ప్రాజెక్టులు ఇక్కడి నుంచి పూర్తి చేసి ఎగుమతులు చేస్తున్నారు.. ఏఐను ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. సైబర్‌ సెక్యూరిటీకి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తోంది. సైబర్‌ నేరాలపై ప్రజలను అప్రమత్తం చేయడం, బాధితులుగా మారకుండా సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌లు అవగాహన కల్పించాలి’’ అని మంత్రి సూచించారు. ఐటీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్‌రంజన్‌ మాట్లాడుతూ.. నగరంలో ఉన్న సైబర్‌ సెక్యూరిటీ సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ను బలోపేతం చేయడానికి నిపుణులు ముందుకు రావాలని సూచించారు. సినీ నిర్మాత దిల్‌ రాజు ప్రసంగిస్తూ.. సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లు జాగ్రత్తగా మెలుగుతూ సమాజాభివృద్ధికి కృషి చేయాలని చెప్పారు. టీహబ్‌ సీఈవో మహంకాళి శ్రీనివాస్, వ్యాఖ్యాత సుమ కనకాల, సినీనటుడు విరాజ్‌ అశ్విన్, సైబరాబాద్‌ సెక్యూరిటీ కౌన్సిల్‌ మాజీ ప్రధాన కార్యదర్శి కృష్ణ యెదుల, ఎండ్‌ నౌ ఫౌండేషన్‌ వ్యవస్థాపకులు డా.విజయభాస్కర్, అనిల్‌ రాచమల్ల; అర్చిత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లకు అవార్డులను ప్రదానం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు