Indian Railway: రెండేళ్లలో 10 వేల నాన్‌ ఏసీ కోచ్‌ల తయారీ

రైళ్లలో నాన్‌ ఏసీ కోచ్‌ల ఉత్పత్తిని వేగవంతం చేసినట్లు.. రెండేళ్లలో 10 వేల కోచ్‌ల ఉత్పత్తికి ప్రణాళిక చేసినట్లు రైల్వేశాఖ తెలిపింది. ఇందులో 5,300 జనరల్‌ కోచ్‌లు ఉంటాయని గురువారం ఓ ప్రకటనలో పేర్కొంది.

Published : 05 Jul 2024 03:52 IST

ఈనాడు, హైదరాబాద్‌: రైళ్లలో నాన్‌ ఏసీ కోచ్‌ల ఉత్పత్తిని వేగవంతం చేసినట్లు.. రెండేళ్లలో 10 వేల కోచ్‌ల ఉత్పత్తికి ప్రణాళిక చేసినట్లు రైల్వేశాఖ తెలిపింది. ఇందులో 5,300 జనరల్‌ కోచ్‌లు ఉంటాయని గురువారం ఓ ప్రకటనలో పేర్కొంది. ‘2024-25లో అమృత్‌ భారత్‌ జనరల్‌ కోచ్‌లతో సహా 2605 జనరల్‌ కోచ్‌లు, అమృత్‌ భారత్‌ స్లీపర్‌ కోచ్‌లతో సహా 1470 నాన్‌ ఏసీ స్లీపర్, 323 ఎస్‌ఎల్‌ఆర్‌ కోచ్‌లు, 32 హైకెపాసిటీ పార్సిల్‌ వ్యాన్లు, 55 పాంట్రీ కార్ల తయారీకి యోచిస్తున్నాం. 2025-26లో అమృత్‌ భారత్‌ జనరల్‌ కోచ్‌లతో సహా మొత్తం 2710 జనరల్‌ కోచ్‌లను, 1910 నాన్‌ ఏసీ స్లీపర్‌తో సహా అమృత్‌ భారత్‌ స్లీపర్‌ కోచ్‌లను, 514 ఎస్‌ఎల్‌ఆర్‌ కోచ్‌లతో సహా అమృత్‌ భారత్‌ ఎస్‌ఎల్‌ఆర్‌ కోచ్‌లను, 200 హైకెపాసిటీ పార్సిల్‌ వ్యాన్‌లు, 110 పాంట్రీ కార్ల తయారీ ప్రణాళిక ఉంది’ అని వివరించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని