Low pressure: బంగాళాఖాతంలో అల్పపీడనం

ఉత్తర ఒడిశా తీరం సమీపంలో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడినట్లు వాతావరణశాఖ పేర్కొంది. అయితే దీని ప్రభావం తెలంగాణపై పెద్దగా ఉండకపోయినా.. ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తోంది.

Published : 29 Jun 2024 05:48 IST

రాష్ట్రంలో ఓ మోస్తరు వర్షాలకు అవకాశం

ఈనాడు, హైదరాబాద్‌: ఉత్తర ఒడిశా తీరం సమీపంలో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడినట్లు వాతావరణశాఖ పేర్కొంది. అయితే దీని ప్రభావం తెలంగాణపై పెద్దగా ఉండకపోయినా.. ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తోంది. శని, ఆదివారాల్లో 15 జిల్లాల్లో బలమైన గాలులతో కూడిన ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని సూచించింది. ఈ మేరకు కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాలకు ‘పసుపు’ రంగు హెచ్చరికలు జారీ చేసింది. హైదరాబాద్‌ నగరంలోనూ తేలికపాటి వర్షాలు పడే అవకాశాలు ఉన్నట్లు పేర్కొంది. అలాగే రాష్ట్రంలో శుక్రవారం పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. జగిత్యాల జిల్లా బీర్పూర్‌ మండలం కొల్లాయిలో అత్యధికంగా 6 సెం.మీ. వర్షపాతం నమోదైంది. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా రేగొండలో 3.6, రాయికల్‌ మండలం అల్లీపూర్‌లో 3.1, హనుమకొండ జిల్లా నడికుడలో 2.6, ములుగు జిల్లా వాజేడు మండలం ధర్మవరంలో 2.2 సెం.మీ. వర్షం కురిసింది. రంగారెడ్డి, మంచిర్యాల, కరీంనగర్, కామారెడ్డి, మేడ్చల్‌ మల్కాజిగిరి, వరంగల్, ఖమ్మం, మహబూబాబాద్‌ జిల్లాల్లోనూ జల్లులు పడ్డాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని