Engineering Colleges: 200 ఇంజినీరింగ్‌ కళాశాలలకు పచ్చజెండా

రాష్ట్రంలో ఇంజినీరింగ్‌ విద్యను అందించే 200 విద్యాసంస్థలకు అఖిల భారత సాంకేతిక విద్యామండలి(ఏఐసీటీఈ) అనుమతి జారీ చేసింది.

Published : 05 Jul 2024 03:53 IST

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఇంజినీరింగ్‌ విద్యను అందించే 200 విద్యాసంస్థలకు అఖిల భారత సాంకేతిక విద్యామండలి(ఏఐసీటీఈ) అనుమతి జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వ, ప్రైవేట్‌ కళాశాలలతో పాటు 10 డీమ్డ్‌ వర్సిటీలు లేదా వాటి ఆఫ్‌ క్యాంపస్‌లు ఏఐసీటీఈకి దరఖాస్తు చేసి అనుమతులు పొందాయి. ఈసారి కొత్తగా  హైదరాబాద్‌లోని దేశముఖ్‌ వద్ద విజ్ఞాన్‌ డీమ్డ్‌ విశ్వవిద్యాలయం(గుంటూరు) ఆఫ్‌ క్యాంపస్‌ ప్రారంభానికి ఏఐసీటీఈ పచ్చజెండా ఊపింది. కొడంగల్‌ నియోజకవర్గంలోని కోస్గిలో ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలో ఈసారి మూడు బ్రాంచీల్లో బీటెక్‌ను ప్రారంభించేందుకు అనుమతి లభించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని