తమిళనాడులో ‘రూ.లక్ష వరకూ ఉచిత వైద్యం’పై అధ్యయనం

ప్రమాదాలు జరిగినప్పుడు బాధితులు అందుబాటులోని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో రూ.లక్ష వరకు ఉచితంగా అత్యవసర వైద్య సేవలు పొందేలా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.

Published : 05 Jul 2024 03:43 IST

తమిళనాడులో ‘ప్రమాద బాధితులకు ఉచిత వైద్యం’ సేవలను పరిశీలిస్తున్న రాష్ట్ర అధికారులు

ఈనాడు, హైదరాబాద్‌: ప్రమాదాలు జరిగినప్పుడు బాధితులు అందుబాటులోని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో రూ.లక్ష వరకు ఉచితంగా అత్యవసర వైద్య సేవలు పొందేలా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ విధానం అమలవుతున్న తమిళనాడులో.. తెలంగాణ వైద్య, ఆరోగ్యశాఖ ఉన్నతాధికారుల బృందం రెండు రోజుల అధ్యయనానికి వెళ్లింది. ఆరోగ్యశ్రీ డైరెక్టర్‌ విశాలాచ్చి, వైద్యవిధాన పరిషత్‌ కమిషనర్‌ జె.అజయ్‌కుమార్‌లు గురువారం ఆయా అంశాలపై తమిళనాడు వైద్య, ఆరోగ్యశాఖ అధికారులతో ప్రత్యేకంగా సమావేశమై చర్చించారు. పథకం అమలవుతున్న ఆసుపత్రులను సందర్శించి.. అక్కడ అనుసరిస్తున్న పద్ధతులను అధ్యయనం చేశారు. శుక్రవారం తమిళనాడు వైద్య, ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతో సమావేశం కానున్నారు. 

  • తమిళనాడులో ప్రభుత్వ ఆసుపత్రులకు ఔషధాల కొనుగోలు విధానంపై రాష్ట్ర వైద్య సేవలు, మౌలిక సదుపాయాల కల్పన సంస్థ (టీజీఎంఎస్‌ఐడీసీ) ఎండీ బి.హేమంత్‌ సహదేవ్‌రావు అధ్యయనం చేస్తున్నారు. గురువారం చెన్నైలో ఆ రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతో ఆయన సమావేశమై.. అక్కడి విధానాలను తెలుసుకున్నారు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని