విప్లవ పోరాటాల అణచివేతకు కేంద్రం కుట్ర: విరసం

దండకారణ్యంలో విప్లవ పోరాటాలతోపాటు ప్రజాసంఘాలను అణచివేయడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం కుట్రలు పన్నుతోందని విరసం తెలుగు రాష్ట్రాల అధ్యక్షుడు అరసవిల్లి కృష్ణ ఆరోపించారు.

Published : 05 Jul 2024 03:40 IST

బాగ్‌లింగంపల్లి, న్యూస్‌టుడే: దండకారణ్యంలో విప్లవ పోరాటాలతోపాటు ప్రజాసంఘాలను అణచివేయడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం కుట్రలు పన్నుతోందని విరసం తెలుగు రాష్ట్రాల అధ్యక్షుడు అరసవిల్లి కృష్ణ ఆరోపించారు. గురువారం హైదరాబాద్‌లోని సుందరయ్య కళానిలయంలో.. విప్లవ రచయితల సంఘం(విరసం) 55వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ‘వికసిత భారత్‌జీ  2047- కార్పొరేట్‌ హిందూ రాష్ట్రం’ పేరిట సదస్సు జరిగింది. కృష్ణ మాట్లాడుతూ.. ఈ నెల 1న కేంద్రం కొత్తగా క్రూరమైన చట్టాలను తెచ్చిందన్నారు. 

  • దండకారణ్యంలో చిన్నారులపై జరుగుతున్న మారణకాండను నిరసిస్తూ హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు పిల్లలు నాటకాన్ని ప్రదర్శించారు. ఈ క్రమంలో చిన్నారుల హక్కులను కాలరాస్తున్నారంటూ.. పిల్లలిద్దరితోపాటు వారి తండ్రి బాలును పోలీసులు తీసుకెళ్లారు. దీంతో కొంతసేపు ఉద్రిక్తత నెలకొంది. ఆ తర్వాత న్యాయవాదులు వారిని తిరిగి సుందరయ్య కళానిలయం వద్దకు తీసుకొచ్చారు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని