సత్వరం.. అత్యవసర వైద్యం!

ప్రజలకు సత్వరం అత్యవసర వైద్య సేవలు అందేలా వైద్య, ఆరోగ్య శాఖ ప్రభుత్వ వైద్య వసతులను మ్యాపింగ్‌ చేయనుంది. భవిష్యత్తులో ప్రతి 30 కిలోమీటర్ల పరిధిలో అత్యవసర సేవలు అందించే ప్రభుత్వ వైద్య వసతి ఉండాలనే ప్రణాళిక నేపథ్యంలో ప్రత్యేక మ్యాపింగ్‌ కార్యక్రమం చేపట్టింది.

Published : 05 Jul 2024 03:19 IST

ఆసుపత్రుల మ్యాపింగ్‌కు శ్రీకారం చుట్టిన ప్రభుత్వం

ఈనాడు, హైదరాబాద్‌: ప్రజలకు సత్వరం అత్యవసర వైద్య సేవలు అందేలా వైద్య, ఆరోగ్య శాఖ ప్రభుత్వ వైద్య వసతులను మ్యాపింగ్‌ చేయనుంది. భవిష్యత్తులో ప్రతి 30 కిలోమీటర్ల పరిధిలో అత్యవసర సేవలు అందించే ప్రభుత్వ వైద్య వసతి ఉండాలనే ప్రణాళిక నేపథ్యంలో ప్రత్యేక మ్యాపింగ్‌ కార్యక్రమం చేపట్టింది. ఈ బాధ్యతను వైద్య, ఆరోగ్య శాఖ.. రాష్ట్ర వైద్య సేవలు, మౌలిక వసతుల కల్పన సంస్థ(టీజీఎంఎస్‌ఐడీసీ)కి అప్పగించింది. అత్యవసర వైద్య సేవలు అందడంలో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఈ సందర్భంగా ప్రాథమికంగా గుర్తించారు. ఇటీవల వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్‌ రాజనర్సింహ ఆ శాఖ ఉన్నతాధికారులతో సమావేశంలో ఈ అంశంపై సమీక్షించారు. త్వరితగతిన మ్యాపింగ్‌ ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు. ఏ గ్రామానికి ఏ వైద్య వసతి ఎంత దూరంలో ఉందో గుర్తించడంతోపాటు ఆ ఆసుపత్రిలో వసతులు వంటివాటిని మ్యాపింగ్‌లో భాగంగా విశ్లేషించనున్నారు. వైద్య, ఆరోగ్య శాఖ ఈ కార్యక్రమాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటోంది. మారుమూల ప్రాంతాలు.. ప్రధానంగా గిరిజన ప్రాంతాలకు వైద్య సేవలు అందడంలో ఎదురవుతున్న సమస్యలను పరిగణనలోకి తీసుకుంటోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని