మల్లారెడ్డి ‘ఆఫ్‌ క్యాంపస్‌ కేంద్రం’పై చర్యలు తీసుకోండి: హైకోర్టు

అనుమతుల్లేకుండా మల్లారెడ్డి యూనివర్సిటీ.. హైదరాబాద్‌ బాలానగర్‌లో ఏర్పాటు చేసిన ఆఫ్‌ క్యాంపస్‌ కేంద్రంపై చట్టప్రకారం తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీచేసింది.

Published : 05 Jul 2024 03:18 IST

ఈనాడు, హైదరాబాద్‌: అనుమతుల్లేకుండా మల్లారెడ్డి యూనివర్సిటీ.. హైదరాబాద్‌ బాలానగర్‌లో ఏర్పాటు చేసిన ఆఫ్‌ క్యాంపస్‌ కేంద్రంపై చట్టప్రకారం తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. దూలపల్లిలోని మల్లారెడ్డి వర్సిటీ.. బాలానగర్‌లో సెంటర్‌ ఆఫ్‌ ఎక్సెలెన్స్‌ ఫర్‌ కామర్స్‌ అండ్‌ డిజైన్‌ పేరుతో ఆఫ్‌ క్యాంపస్‌ ఏర్పాటు చేయడాన్ని సవాలు చేస్తూ నవీన ఎడ్యుకేషనల్‌ సొసైటీ తదితరులు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై ఇటీవల జస్టిస్‌ సి.వి.భాస్కర్‌రెడ్డి విచారణ చేపట్టారు. పిటిషనర్‌ తరఫున న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం, యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యూజీసీ) అనుమతులు లేకుండా ఆఫ్‌ క్యాంపస్‌ కేంద్రం ఏర్పాటు చేయరాదన్నారు. ఈ కేంద్రంలో బీకాం, బీఎస్సీ కోర్సులకు 2024-25 విద్యా సంవత్సరానికి అడ్మిషన్‌లు చేపడుతున్నారని, వీటిని నిలువరించడానికి తగిన ఆదేశాలు జారీ చేయాలని కోరారు. యూజీసీ నిబంధనల ప్రకారం మల్లారెడ్డి యూనివర్సిటీ, ఆఫ్‌ క్యాంపస్‌ కేంద్రంపై తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి, యూజీసీ, రాష్ట్ర ఉన్నత విద్యామండలికి ఆదేశాలు జారీచేశారు. తదుపరి విచారణను ఈ నెల 24వ తేదీకి వాయిదా వేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని